BigTV English

Facts of Coconut: గుడిలో కొట్టిన కొబ్బరికాయ  కుళ్ళితే అరిష్టమా..  పువ్వు వస్తే అదృష్టమా?  అసలు నిజం ఇదే

Facts of Coconut: గుడిలో కొట్టిన కొబ్బరికాయ  కుళ్ళితే అరిష్టమా..  పువ్వు వస్తే అదృష్టమా?  అసలు నిజం ఇదే

Facts of Coconut: మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోయిందా..? అందులోంచి దుర్వాసన వచ్చిందా..? అయితే అది దేనికి సంకేతమో తెలుసా..? అలాగే మీ కొబ్బరి కాయలో పువ్వు వచ్చిందా..? అందులోంచి పరిమళభరితమైన సువాసన వెదజల్లుతుందా..? ఇది దేనికి నిదర్శనమో తెలుసా..? అసలు కొబ్బరికాయ కుళ్లినా..? పువ్వు వచ్చినా జరిగే అరిష్ట, అదృష్టాల  గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.


మనదేశంలో భక్తి పూర్వకమైన ప్రతి క్రియలోనూ కొబ్బరికాయలను ఉపయోగిస్తారు. మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాలు వాళ్లు తమ దేవుళ్లకు కొబ్బరికాయలను నైవేద్యంగా నివేదిస్తుంటారు. ఇక హిందూ సంప్రదాయంలో చిన్న  పూజల నుంచి పెద్ద ఎత్తున జరిగే హోమాల వరకు కొబ్బరికాయ తప్పనిసరిగా ఉంటుంది. కొబ్బరికాయను పూర్ణఫలం అని కూడా  అంటారు. దేవుడి నుంచి పూర్ణమైన ఫలితాన్ని ఆశించి సమర్పించేది  కనుక కొబ్బరికాయకు ఈ పేరు వచ్చింది. వివిధ హోమాలు, యాగాలలోనూ కొబ్బరికాయను ఉపయోగిస్తారు. అలాంటి టెంకాయకు పెద్ద చరిత్రే ఉంది.

పూర్వం విశ్వామిత్రుడు అనే ముని బ్రహ్మ మీద కోపంతో సృష్టికి ప్రతి సృష్టి చేయాలనుకున్నాడట. అందుకోసం తన తపశ్శక్తిని ఉపయోగించి ప్రతిసృష్టి చేయబోతుంటే దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారట. దీంతో శ్రీమన్నారాయణుడు విశ్వామిత్రుడిని శాంతింపజేశాడట. అప్పటికే సగం సృష్టిని తయారు చేసిన విశ్వామిత్రుడు.. విష్ణువు సూచన మేరకు కొబ్బరికాయను సృష్టించినట్టు పురాణగాథ. మరో కథనం ప్రకారం త్రిపురాసురుడిని సంహరించేందుకు వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా.. మూడు కళ్లు, శిరస్సు, జుట్టుతో తన తలను పోలిన  టెంకాయను సృష్టించి వినాయకుడికి నివేదించినట్టు పండితులు చెప్తున్నారు. అందుకే కొబ్బరికాయ నిర్మాణం మొత్తం మనిషి శరీరంతో పోలి ఉంటుంది.  అలాగే కొబ్బరి కాయ పైన ఉండే పొర మనిషి చర్మానికి ప్రతీక. పీచు మాంసానికి నిదర్శంన. లోపల ఉండే చిప్పలు మనిషి ఎముకలు, అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువుకు నిదర్శనంగా పోలుస్తారు.


టెంకాయ కుళ్లిపోతే అరిష్టమా..?

అయితే కొన్ని సందర్భాలలో కొట్టిన కొబ్బరికాయలు కుళ్లిపోతుంటాయి. అయితే అలా కుళ్లిపోవడం వల్ల అరిష్టమేమో అనుకుని భయపడేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే దేవుడి ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే అరిష్టం కాదని అది కూడా శుభమే అంటున్నారు పండితులు. అంత వరకు మీరు పడిన కష్టాలు మొత్తం కుళ్లిన కొబ్బరి కాయ రూపంలో తీరనున్నాయని పండితులు చెప్తున్నారు. అందుచేత కొబ్బరికాయ కుళ్లినా గాబరా పడాల్సిన పని లేదంటున్నారు. సానుకూల దృక్పథంతోనే ఉండాలని సూచిస్తున్నారు.  అయితే కొన్ని సందర్భాలలో మాత్రం కొబ్బరి కాయ కుళ్లిపోతే అరిష్టమేనని హెచ్చరిస్తున్నారు. దేవుడికి మొక్కుబడి తీర్చుకునే సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే అశుభంగా భావించాలని సూచిస్తున్నారు. అయితే పూజలో కొబ్బరికాయ కుళ్లిపోతే కాళ్లు చేతులు కడుక్కుని మరో టెంకాయను తీసుకుని నైవేద్యంగా సమర్పించవచ్చని చెప్తున్నారు.

కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టమా..?

ఇక టెంకాయలో పువ్వు వస్తే అదృష్టంగా భావిస్తుంటారు. అయితే అన్ని సందర్భాలలో కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టంగా బావించాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు. మామూలుగా దేవుడికి కొట్టినప్పుడు పువ్వు రావడం కన్నా మీరు ఏదైన కోరిక కోరుకుని దేవుడి ముందు కొబ్బరికాయ కొడితే ఆ సందర్భంలో పువ్వు వచ్చిందంటే అది శుభ పరిణామంగా బావించాలని  పండితులు చెప్తున్నారు. మీరు కోరుకున్న కోరిక వందశాతం నెరవేరుతుందని అందుకు సంకేతంగానే కొబ్బరికాయలో పువ్వు వస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే పువ్వు రావడం సంతానప్రాప్తికి నిదర్శనంగా కూడా బావించొచ్చు అంటున్నారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×