BigTV English

Nani: ‘హిట్’ యూనివర్స్‌లో బాలీవుడ్ హీరో.. నాని ప్లానింగ్ మామూలుగా లేదుగా.!

Nani: ‘హిట్’ యూనివర్స్‌లో బాలీవుడ్ హీరో.. నాని ప్లానింగ్ మామూలుగా లేదుగా.!

Nani: చాలామంది హీరోలు, హీరోయిన్లు యాక్టింగ్‌లో తమ సత్తా చాటుకున్న తర్వాత ముందుగా నిర్మాణ రంగంలో కూడా ఒక అడుగు పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. అలా టాలీవుడ్‌లో కూడా ఇప్పటికే ఎంతోమంది నటీనటులు నిర్మాతలుగా మారి హిట్ కొట్టారు. అందులో నేచురల్ స్టార్ నాని కూడా ఒకడు. నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమాల వల్ల పలువురు యంగ్, టాలెంటెడ్ దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో శైలేష్ కొలను (Sailesh Kolanu) ఒకడు. ‘హిట్’ సినిమాను నిర్మించి శైలేష్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు నాని. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుండి రెండు సినిమాలు విడుదల కాగా ఇప్పుడు ‘హిట్ 3’లో తనే హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.


ఇంకా చూడలేదు

మే 1న ‘హిట్ 3’ (Hit 3) ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు నాని. తాజాగా ‘హిట్’ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవ్వడంపై కూడా స్పందించాడు. తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘హిట్’ చిత్రాన్ని హిందీలో కూడా అదే పేరుతో రీమేక్ చేయగా ఇందులో రాజ్‌కుమార్ రావు హీరోగా నటించాడు. కానీ ఈ మూవీ హిందీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దానిపై నాని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ‘‘నేను ఇప్పటికీ హిట్ సినిమా హిందీ వర్షన్‌ను చూడలేదు. దిల్ రాజు ఆ సినిమాను నిర్మించారు. నా దగ్గర నుండే ఆయన హక్కులు కొన్నారు’’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు నాని (Nani).


ఇద్దరినీ కలుపుతా

‘‘రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) చాలా మంచి నటుడు. నేను తన సినిమాలు చాలా చూశాను. వాళ్లు మాకంటే మంచి ప్రొడక్ట్ అందించుంటారని బలంగా నమ్ముతున్నాను. నేను ఇప్పటికీ ఆ రీమేక్‌ను చూడలేదు కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత దానిని ప్రేక్షకులు ప్రశంసించడం మాత్రం విన్నాను. పైగా అందులో రాజ్‌కుమార్ రావు పర్ఫార్మెన్స్ గురించి కూడా పాజిటివ్ రివ్యూలు చూశాను. రాజ్‌కుమార్ రావును మళ్లీ హిట్ యూనివర్స్‌లోకి తీసుకువస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తన విక్రమ్ జయ్‌సింగ్ క్యారెక్టర్, నా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కలిసి తెరపై కనిపించాలని కోరుకుంటున్నాను’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఈ నేచురల్ స్టార్.

Also Read: చిరంజీవి సినిమాలో నాని, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశావ్ శ్రీకాంత్

వేర్వేరు రాష్ట్రాల్లో కథలు

‘‘హిట్ యూనివర్స్ అనేది మేము ముందు నుండి అనుకున్న ఐడియా కాదు. ముందుగా హిట్ సినిమాకు కేవలం సీక్వెల్ మాత్రమే తెరకెక్కించాలని అనుకున్నాం. కానీ హిట్ 2 డిఫరెంట్ స్టోరీ అని అర్థమయ్యింది. అలా హిట్‌వర్స్ అనేది ప్రారంభమయ్యింది. అలా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పోలీస్ ఆఫీసర్లు వేర్వేరు కేసులను డీల్ చేయడమే హిట్‌వర్స్ కథ. హిట్ 3 అనేది కశ్మీర్, జైపూర్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో తెరకెక్కించాం’’ అని చెప్పుకొచ్చాడు నాని. ‘హిట్ 3’ సినిమాలో కార్తి గెస్ట్ రోల్ ఉందని వార్తలు వస్తుండగా దానిపై పెద్దగా స్పందించకుండా సినిమా చూసి తెలుసుకోండి హింట్ ఇచ్చాడు నేచురల్ స్టార్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×