E-Paper
Advertisement

Peddi Song: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పండగ.. ఐపీఎల్ అన్ అఫీషియల్ యాంథమ్‌గా ‘రయ్ రయ్ రారా’!

Peddi Song: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పండగ.. ఐపీఎల్ అన్ అఫీషియల్ యాంథమ్‌గా ‘రయ్ రయ్ రారా’!
Advertisement

Peddi Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా విడుదల కంటే ముందే ఈ చిత్రంలోని ‘రయ్ రయ్ రారా’ అనే పాట ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పాట హిందీ వెర్షన్ బాలీవుడ్ బెల్ట్‌తో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read also-Dhurandhar 2: ధురంధర్ ఎఫెక్ట్.. దెబ్బకు వెనక్కి తగ్గిన మూవీస్.. లిస్ట్ వైరల్!

ఐపీఎల్ ఎడిట్స్‌తో..

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘రయ్ రయ్ రారా’ పాట మార్మోగిపోతోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తుండటంతో, క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల (ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ) వీడియోలకు ఈ పాటను జత చేసి ఎడిట్స్ చేస్తున్నారు. ఈ పాటలోని బీట్, ఎనర్జీ ఐపీఎల్ జోష్‌కు సరిగ్గా సరిపోవడంతో, ఇది దాదాపు ఈ సీజన్ ‘అన్‌అఫీషియల్ యాంథమ్’ గా మారిపోయింది. ఉత్తరాది ప్రేక్షకులు సైతం చరణ్ మాస్ స్టెప్పులకు, రెహమాన్ మ్యూజిక్‌కు ఫిదా అవుతున్నారు.

రెహమాన్ మ్యాజిక్..

చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ ఒక పక్కా లోకల్ మాస్ బీట్‌ను అందించారు. ఈ పాటలోని ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రామ్ చరణ్ గ్రేస్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ తోడవ్వడంతో ఈ సాంగ్ ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారింది. కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ వెర్షన్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ‘నాటు నాటు’ తర్వాత రామ్ చరణ్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్ చేరిందని చెప్పవచ్చు.

Advertisement

Read also-Vrushakarma Glimpse: ‘వృషకర్మ’ గ్లింప్స్ వచ్చేశాయ్.. నాగచైతన్య ఈ సారి హిట్ కొట్టేసేలా ఉన్నాడు..

ఐపీఎల్ యాంథమ్‌గా..

తాజా సమాచారం ప్రకారం, ఈ పాటకున్న క్రేజ్‌ను గమనించిన ఐపీఎల్ నిర్వాహకులు, ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో లేదా మ్యాచ్‌ల విరామ సమయంలో ‘రయ్ రయ్ రారా’ హిందీ వెర్షన్‌ను ప్లే చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఒక తెలుగు సినిమా పాట ఐపీఎల్ వంటి అంతర్జాతీయ వేదికపై ఈ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. ‘పెద్ది’ సినిమా క్రీడా నేపథ్యంలో (స్పోర్ట్స్ డ్రామా) తెరకెక్కుతుండటం, దానికి తగ్గట్టుగానే పాటలు ఇంత పవర్‌ఫుల్‌గా ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. రామ్ చరణ్ మేనరిజమ్స్, ఆ సిగ్నేచర్ స్టెప్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సాంగ్ ఐపీఎల్ లో ఏ రేంజ్ హిట్ సాధిస్తుందో చూడాలి.

Related News

Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. ఇది అస్సలు ఊహించలేదు మావా..!

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

Big Stories

Advertisement
×