Nayanthara: సాధారణంగా బయట చిన్నపాటి జబర్దస్త్ ఆర్టిస్టులు కనిపిస్తేనే.. జనం చాలా వింతగా చూస్తారు. అలాంటిది ఒక స్టార్ కపుల్.. ఒక రెస్టారెంట్ కు వెళితే.. అక్కడ ఒక్కరు కూడా వారిని పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్. నయన్ గురించి తెలుగువారికి మాత్రమే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
జవాన్ సినిమాతో అమ్మడు పాన్ ఇండియా స్టార్ డమ్ ను అందుకుంది. ఇక ఈ మధ్యన తన పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసి .. ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. నయన్ కనిపిస్తే.. అభిమానులు సెల్ఫీలు, వీడియోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. కానీ, ఈసారి మాత్రం అలా జరగలేదు. నయన్ ఎదురుగా కనిపించినా కూడా ఆమెను ఎవరు పట్టించుకోలేదు.
RK Roja: నా కొడుకు పక్కన నన్ను న్యూడ్ గా నిలబెట్టి మార్ఫింగ్ చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన రోజా
ఇది ఎక్కడ జరిగింది అంటే.. ఢిల్లీలో అని తెలుస్తోంది. నయన్, విగ్నేష్ కలిసి ఢిల్లీలో ఒక చిన్న ధాభాలో ఫుడ్ తింటూ కనిపించారు. అక్కడ ఎవరు వారిని గుర్తుపట్టలేదు. దీంతో.. వారు కూడా సాధారణ కస్టమర్స్ లానే .. ఒక అరగంట ఫుడ్ కోసం ఎదురుచూసి.. అది వచ్చాక ఫుల్ గా లాగించేసి బయటకు వచ్చేశారు.
నయన్ ను గుర్తుపట్టిన ఒకరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా వైరల్ గా మారింది. నయన్, విగ్నేష్ కూడా చాలా సింపుల్ దుస్తుల్లో కనిపించారు. అందుకే వారిని గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు అని కొందరు అంటుండగా.. ఎలాంటి డ్రెస్ లో ఉన్నా కూడా ముఖం అయితే మారదు కదా. ధనుష్ గొడవ తరువాత జనాలు నయన్ ను లైట్ తీసుకున్నారు. ఆమెకు ఇంతకు మించిన అవమానం ఇంకొకటి ఉండదు అని చెప్పుకొస్తున్నారు.
Bachhala Malli First Song: అదే నేను అసలు లేను.. గోదావరి సినిమాలో మెలోడీ సాంగ్ గుర్తొచ్చింది భయ్యా..
సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు .. తమను గుర్తుపట్టి తమతో సెల్ఫీలు తీసుకోవాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ, ఈసారి ఆ భాగ్యం నయన్ కు లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక నయన్ కెరీర్ విషయానికోస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క నిర్మాతగా బాగానే సంపాదిస్తుంది. విగ్నేష్ సైతం ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.