BigTV English

Vastu Shastra Tips : ఇంట్లో తెలియని సమస్య ఇబ్బంది పెడుతోందా..

Vastu Shastra Tips : ఇంట్లో తెలియని సమస్య ఇబ్బంది పెడుతోందా..

Vastu Shastra Tips : వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం ఉండాలంటోంది శాస్త్రం. ఇల్లు చక్కగా నిర్మాణం చేసినా ఒక్కోసారి ఏదో సమస్య ఇంటి యజమానిని వేధిస్తూ ఉంటోంది. నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరిన వెంటనే మరోటి తగులుతూ ఉంటుంది. ప్రతీ గృహానికి వాస్తు పురుషుడు ఉంటాడని శాస్త్రం చెబుతోంది.


అందుకు కారణం గృహానికి సెంటర్ పాయింట్ లో పిల్లర్. ఇంటి నాభి స్థానంలో స్తంభం లాంటిది ఉంటే
ఆ గృహ యజమాని మనశ్శాంతితో ఉండలేడని శాస్త్రం చెబుతోంది. సమస్యలకి కారణం వాస్తు పురుషుడి నాభిస్థానంలో పిల్లర్ ఉండటమే. మన శరీరంలో కొన్ని సెన్సిటివ్ పాయింట్ ఉన్నట్టే గృహానికి కూడా వాస్తు పురుషుడి నాభి స్థానం కూడా ముఖ్యమైంది. ఇంటి గర్భస్థానంలో పిల్లర్ పాయింట్ వస్తే కష్టమే. నాభి స్థానానికి కొంచెం పక్కన పిల్లర్ వచ్చిన సమస్య లేదు. గోడల్లాంటి ఉన్నా ఇబ్బంది లేదు. కాని పిల్లర్ మాత్రం ఉండకూడదంటోంది వాస్తు శాస్త్రం. వీలైతే వాల్ కూడా నాభిస్థానంలో రాకుండా చూసుకుంటే మరీ మంచిది.

ఇల్లంటే నాలుగు గోడలు , స్లాబు మాత్రమే కాదు. వాస్తు పురుషుడికి ఇబ్బంది లేకుండా నిర్మాణం ఉండాలి. ఇంట్లో వాస్తు పురుషుడు ఒక్కడే కాదు సకల దేవతా అసరులు ఉంటారు. ఎవరెవరు ఏ వర్ణాలతో ఉంటారో స్పష్టంగా వాస్తు శాస్త్రం చెబుతోంది. వాళ్ల తత్వాలు ఏంటనేది కూడా స్పష్టంగా చెప్పబడింది. రకరకాల దేవతలు ఇంట్లో కొలువుతీరుండే నిలయం గృహం. అలాంటి ఇంట్లో ఉన్న దేవతలకి ఇచ్చే గౌరవమే ఇంటి గుమ్మానికి పసుపు రాయడం పూజ చేయడం. బయట ముగ్గేయడం, ఇంట్లో పూజ చేయడం అన్నీ దీని కిందకే వస్తాయి. ఇంట్లో సాంబ్రాణి వేయడం దేవతలకి ఇచ్చే మర్యాదగా భావించాలి.


Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×