E-Paper
Advertisement

Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. దొంగల్ని ఎలా కొట్టాడంటే..

Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. దొంగల్ని ఎలా కొట్టాడంటే..
Advertisement

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో పట్టపగలు జరిగిన ఓ భారీ దోపిడి ప్రయత్నం తీవ్ర కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ జ్యూవెల్లర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కస్టమర్‌లా షాపులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు.. లోపలికి రాగానే తన వద్ద ఉన్న నకిలీ తుపాకీతో పాటు మారణాయుధాలను బయటకు తీసి షాపు యజమానిని బెదిరించాడు. అయితే.. యజమాని ఏమాత్రం భయపడకుండా దొంగను ధైర్యంగా ఎదిరించాడు. దీనితో కంగారుపడ్డ దుండగుడు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో యజమానిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైనా సరే షాపు యజమాని దుండగులపై ధైర్యంగా ప్రతిఘటించాడు. ఈ దోపిడీ ప్రయత్నానికి ఇద్దరు దుండగులు రెండు పల్సర్ బైక్‌లపై వచ్చారని సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆ బైక్‌లకు నెంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం.  చివరకు యజమానిని గాయపరిచి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఘటనపై పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

Big Stories

Advertisement
×