BigTV English

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే.. ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు తప్పవు

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే.. ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు తప్పవు

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారం కేవలం ప్రవేశ ద్వారం మాత్రమే కాదు.. ఇది ఇంటికి ప్రధాన శక్తి వనరుగా, లక్ష్మీ రాకకు మార్గంగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం ద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం యొక్క తలుపుకు ఏదైనా వాస్తు లోపం ఉంటే లేదా సరిగ్గా లేకపోతే.. అది మీ ఇంటి ఆనందం, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది. వీటిని నివారించడం ద్వారా మీరు లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు. అంతే కాకుండా ఇంట్లో ఆనందం, డబ్బు కూడా పెరుగుతాయి.


సూర్యోదయం, సూర్యాస్తమయం:
సూర్యోదయం తర్వాత.. ముఖ్యంగా సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుభ్రం చేసుకోవడం వల్ల ఇంటోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాయంత్రం మీరు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం చేయకపోవడం వల్ల అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుంది. అంతే కాకుండా ఇది ఇంట్లో అశాంతి, మానసిక ఒత్తిడి , డబ్బు నష్టానికి దారితీస్తుంది.

ప్రధాన ద్వారం దగ్గర చెత్త :
ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ ఏదైనా మురికి, విరిగిన వస్తువులు, పాత బూట్లు-చెప్పులు లేదా చెత్త పేరుకుపోవడం వల్ల కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. అంతే కాకుండా ఇంటి శ్రేయస్సును అడ్డుకుంటుంది. అలాంటి వస్తువులు లక్ష్మీదేవి మార్గాన్ని అడ్డుకుంటాయి. అంతే కాకుండా ఇంటి ఆనందాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే.. తలుపు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. అంతే కాకుండా చెత్తను తొలగించి సరైన స్థలంలో ఉంచండి.


తలుపు మీద పగుళ్లు:
ప్రధాన తలుపు పగుళ్లతో ఉంటే.. లేదా కుళ్ళిపోయి ఉంటే లేదా పెయింట్ పోయి ఉంటే, వాస్తు ప్రకారం అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి ఖ్యాతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా.. ఆర్థిక స్థితిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. తలుపు పరిస్థితి బాగా లేకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఆగిపోతుంది. కాబట్టి దానిని ఎల్లప్పుడూ మంచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

చెత్తను తలుపు బయట వేయడం:
చాలా మంది ఊడ్చిన తర్వాత చెత్తను తలుపు బయట పారవేస్తారు. ఇది వాస్తు ప్రకారం చాలా తప్పు. ఇంట్లో ఎల్లప్పుడూ చెత్తను సేకరించి సరైన స్థలంలో వేయండి. తద్వారా ఇంట్లో శ్రేయస్సు కొనసాగుతుంది.

తలుపు మీద దుమ్ము పేరుకుపోవడం:
ప్రధాన తలుపు మీద సాలెపురుగులు లేదా దుమ్ము పేరుకుపోవడం ఇంట్లో శక్తి ప్రవాహం ఆగిపోయిందని సూచిస్తుంది. దీని అర్థం.. ఇంట్లో సోమరితనం, పేదరికం , అడ్డంకులు పెరుగుతాయి. అంతే కాకుండా సాలెగూడులు, దుమ్ము ఇంట్లోకి ప్రతి కూలతను తీసుకువస్తాయి. లక్ష్మీదేవి రాకకు అడ్డంకులను సృష్టిస్తాయి. అందుకే.. తలుపు, దాని పరిసరాల శుభ్రతను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోండి.

Also Read: కేతువు సంచారం.. వీరికి సమస్యలు పెరుగుతాయ్

చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం:
వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ప్రధాన ద్వారం దగ్గర లేదా ముందు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీని వల్ల ఇంట్లో ఉద్రిక్తత, అశాంతి ఏర్పడతాయి. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చీపురును ఎల్లప్పుడూ సరైన స్థలంలో.. అల్మారాలో లేదా ఒక మూలలో ఉంచండి.

ప్రధాన ద్వారం ముందు గోడ, మెట్లు లేదా బాత్రూమ్ ఉంటే.. అది ఇంట్లో శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. శక్తి ప్రవాహం ఆగిపోయినప్పుడల్లా.. అది ఇంట్లో మానసిక ఒత్తిడి, అడ్డంకులు , ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రధాన ద్వారం ముందు అలాంటి అడ్డంకులను నివారించడానికి ప్రయత్నించండి. ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచండి.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×