E-Paper
Advertisement

ECIL Recruitment: టెన్త్ అర్హతతో మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఇంకెందుకు ఆలస్యం.!

ECIL Recruitment: టెన్త్ అర్హతతో మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఇంకెందుకు ఆలస్యం.!
Advertisement

ECIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ క్లాస్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 5 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 45

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషనిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, షీట్‌ మెటల్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌ విభాగాల్లో వెకెన్సీలు ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

టెక్నీషియన్ గ్రేడ్-2 : 45 జాబ్స్

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఐటీఐలో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 ఏప్రిల్ 30వ తేది నాటికి 27 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి రూ.20,480 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 16

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 5

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నాన్ రీఫండబుల్ ఫీజు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.ecil.co.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంద. నెలకు రూ.20,480 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Also Read: Indian Air Force Recruitment 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు జాబ్ గ్యారంటీ !

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 45

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 5

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×