NTR – Prashant Neel:సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో బర్త్ డే వస్తోంది అంటే ఇక హడావిడి మామూలుగా ఉండదు. ఇక మన టాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తోంది అంటే.. వారం రోజుల నుంచే సందడి మొదలవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR ), చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి హీరోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తమ అభిమాన హీరోల పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూసే వారి సంఖ్య కూడా లేకపోలేదు. అయితే ఈసారి ఎన్టీఆర్ బర్త్డే రాబోతున్న నేపథ్యంలో బర్తడే ట్రీట్ ఏదైనా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదని చెప్పేశారు ప్రశాంత్ నీల్. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్.. వార్ -2 నుంచీ అప్డేట్..
ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈయన తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ (Prashanth Neel) తో ఒక సినిమా చేస్తుండగా.. మరొకవైపు బాలీవుడ్ లో ‘వార్ 2 ‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే అంజనాలు భారీగా పెరిగిపోయాయి. హృతిక్ రోషన్ (Hrithik Roshan), కియారా అద్వానీ(Kiara advani) కీలక పాత్రలో నటిస్తూ ఉండగా.. ఎన్టీఆర్ ఇందులో రా ఏజెంట్ గా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అందుకే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్లు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపుకు తెరదించుతూ.. వార్ 2 టీం ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ పై హింట్ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను కూడా పంచుకున్నారు. దానికి ఎన్టీఆర్ కూడా అంతే చమత్కారంగా రిప్లై ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో వార్ 2 మేకర్స్ కూడా ఈ పుట్టినరోజును వార్ -2 తో సెలబ్రేట్ చేసుకోండి అంటూ ఎన్టీఆర్ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.
ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రశాంత్ నీల్..
మరోవైపు తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీళ్ మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పేశారు. ఈ మూవీతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. సెట్లోకి ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏదైనా సర్ప్రైజింగ్ అప్డేట్ వస్తుందని, గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు ప్రశాంత్ . ఇప్పుడు రిలీజ్ చేయడం లేదని, మరో తేదీకి వాయిదా వేస్తామని వెల్లడించారు. మొత్తానికైతే ఆశ పెట్టుకున్న అభిమానులకు ప్రశాంత్ నిరాశ మిగిల్చారని చెప్పవచ్చు. ఏది ఏమైనా తెలుగు అభిమానులను ప్రశాంత్ బాగా హర్ట్ చేశారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు .
also read:Bhairavam Movie Update: భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు ఎక్కడంటే..?
#War2Glimps Release On #NTRBirthday#NTRNeel #JrNTR #HrithikRoshan #War2Teaser #NTRBirthdayMonth #BigtvCinema@tarak9999 @NTRNeelFilm @iHrithik pic.twitter.com/CJYzCzPYf5
— BIG TV Cinema (@BigtvCinema) May 17, 2025