BigTV English

Plastic wire in Train Meal: పరాటాలో ప్లాస్టిక్ వైర్.. రూ. 10 లక్షల జరిమానా !

Plastic wire in Train Meal: పరాటాలో ప్లాస్టిక్ వైర్.. రూ. 10 లక్షల జరిమానా !

Plastic Wire in Train Meal: రైలులో అందించిన ఫుడ్ లో ప్లాస్టిక్ వైర్ కనిపించిందంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ ప్రయాణికుడు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై స్పందించిన ఐఆర్ సీటీసీ స్పందించి.. సదరు ట్రైన్ క్యాటరర్ కు ఏకంగా రూ. 10 జరిమానాను విధించింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణానికే ప్రిపరెన్స్ ఇస్తుంటారు. దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వే రోజూ లక్షల మందిని తమ గమ్యస్థానాల్లోకి చేర్చుతుంటది. ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుని తింటుంటారు.


అయితే, ఇటీవల పలు వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. పలు ట్రైన్ లలో అందించే ఫుడ్ బాగాలేదంటూ ప్రయాణికులు తమ ఆందోళనను ఆ వీడియోల్లో వ్యక్తం చేశారు. డెహ్రాడూన్ శతాబ్ధి ట్రైన్ లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైందంటా. రైలులో అందించిన పరాటా ఆహారంలో ప్లాస్టిక్ వైర్ కనిపించిందంటా. దీంతో వెయిటర్ అతనికి సారీ చెప్పి, మరో ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడంటా. ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఐఆర్‌సీటీసీ స్పందించించి సదరు క్యాటరర్ కు రూ. 10 లక్షల జరిమానా విధించిందంటా. అంతేకాదు.. దీనిపై పూర్తిగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read:  ‘జీడీపీ అంటే ఏమిటో నీకే తెల్వదు.. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది’


ఇదిలా ఉంటే.. భారతీయ రైల్వేలలో పరిశుభ్రత, ఆహార సేవల నాణ్యతపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న సంఖ్య భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2022 మార్చి నాటికి ఫిర్యాదుల సంఖ్య 1192 గా ఉంటే.. అది ఏప్రిల్ 2023 మరియు ఫిబ్రవరి 2024 మధ్య భయంకరమైన 6948కు పెరిగాయి. దాదాపుగా ఐదు రెట్లు పెరిగాయి. అయితే, మరో విషయమేమంటే.. కేవలం పలు ట్రైన్లలోనే కాదు.. చాలా ట్రైన్లలో కూడా ఇదే విషయమై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్నాయంటా.

గతంలో ఈ ఫిర్యాదులపై ఐఆర్‌సీటీసీ మాట్లాడుతూ.. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకుని, సంబంధిత కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే అంటూ అందులో పేర్కొన్నారు.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×