Temples – Zodiac sign: ఏ రాశుల వారు ఏ ఆలయాన్ని సందర్శించాలో మీకు తెలుసా..? అలా సందర్శిస్తే మనసులోని న్యాయమైన కోరికలు నెరవేరుతాయని మీకు తెలుసా..? అయితే ఏ గుడికి ఏ రాశుల వారు వెళ్లాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
మేషరాశి:
ఈ రాశి జాతకులు మాత వైష్టో దేవి ఆలయాన్ని సందర్శించాలట. అక్కడి అమ్మవారికి మనఃస్పూర్తికి మొక్కి నైవేద్యం సమర్పిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయట. ఇంకా ఈ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అని ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకున్న ఇతర రాశుల వారికి కూడా మంచే జరుగుతుందట.
వృషభ రాశి:
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మనఃస్పూర్తిగా జగన్నాథుడిని దర్శించుకుని మనసులోని కోరికలు చెప్పుకుంటే అవి తప్పకుండా నెరవేరతాయట.
మిథున రాశి:
మిథున రాశి జాతకులు దర్శించాల్సిన ఆలయం ద్వారకా అక్కడి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుని మనసులోని కోరికలు చెప్పుకుంటే తీరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం.
కర్కాటకం:
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా దర్శించుకోవాల్సి క్షేత్రం వారణాసి అదే కాశి. కాశిలో అడుగుపెట్టిన జన్మ ధన్యం అంటారు. అలాంటిది కోరిక నెరవేరాలంటే ఎంత అదృష్టం ఉండాలి. కానీ కర్కాటక రాశి జాతకులు మనఃస్పూర్తిగా కాశీ విశ్వేశ్వరుడిని ధ్యానించి మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడని పురాణాలు గాథ.
సింహ రాశి:
సింహ రాశి జాతకులు తప్పకుండా వెళ్లాల్సిన పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం తిరుమల అని చెప్తున్నారు. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుని ఈ రాశి జాతకులు తమ మనసులోని కోరికలు విన్నవించుకుంటే ఆయన తప్పక వింటాడని.. మీ కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం.
కన్య రాశి:
ఈ రాశి జాతకులు జీవితంలో ఒక్కసారైన దర్శించాల్సిన ఆలయం షిరిడీ. కన్యారాశి వాళ్లు నివేదించిన కోరికలు ఆ షిరిడి సాయిబాబా సావధానంగా వింటాడట. వినడమే కాదు మీ కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా తీరుస్తాడని చెప్తారు.
తులా రాశి:
తులా రాశిలో పుట్టిన వ్యక్తులు తమ మనసులోని కోరికలు నెరవేరాలంటే తప్పకుండా సోమనాథ్ ఆలయాన్ని సదర్శించాలని చెప్తుంటారు. ఆ సోమనాథుడికి మీ మనసులోని కోరికలు విన్నవించుకుంటే తప్పకుండా తీరుస్తాడట.
వృశ్చిక రాశి:
ఈ రాశిలో జన్మించిన జాతకులు జీవితంలో ఒక్కసారైనా అమరనాథ్ యాత్ర చేయాలట. అక్కడి మంచు లింగానికి తమ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పకుడా నేరవేరుతుందట.
ధనస్సు రాశి:
ధనస్సు రాశిలో పుట్టిన వ్యక్తులు తమ కోరికలు నెరవేరాలంటే తప్పకుండా బద్రీనాథ్ వెళ్లాల్సిందే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ బద్రీనాథుడి చెంత మీ న్యాయమైన కోరికల చిట్టా విప్పితే.. ఆయన కరుణిస్తాడని మీ కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు.
మకర రాశి:
ఈ రాశిలో జన్మించిన జాతకులు జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించాలని చెప్తున్నారు. ఈ ఆలయంలోని కేదారనాథుడికి మీ న్యాయమైన కోరికలు చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయట.
కుంభ రాశి:
కుంభ రాశిలో పుట్టిన వ్యక్తులు హరిద్వార్ ను దర్శించాలని జ్యోతిష్యలు చెప్తున్నారు. అక్కడి స్వామికి మీ కోరికలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయట.
మీన రాశి:
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ మనసులోని కోరికలు నెరవేరాలంటే రుషికేశ్ వెళ్లాల్సిందే అంటున్నారు జ్యోతిష్య పండితులు. అక్కడి స్వామికి మీ మనసులోని కోరికలు నివేదించుకుంటే ఆయన తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తాడని చెప్తున్నారు.
అయితే ఆ రాశి వారు మాత్రమే ఆ ఆలయానికి వెళ్లాలన్న నిబంధనేం లేదు. కానీ ఆయా రాశులు వారు ఎన్ని దేవుళ్లకు మొక్కినా మా కోరిక తీరడం లేదు అనుకునే వారు మీ రాశి ఆధారంగా ఆ ఆలయాన్ని సందర్శించండి. మీ కోరిక న్యాయమైనది అయితే కచ్చితంగా నెరవేరుతుందని జ్యోతిష్యలు చెప్తున్నారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు