Weekly Horoscope: ఈ వారం ముఖ్యమైన గ్రహ మార్పులు జరగనున్నాయి. జులై 28న బృహస్పతి (గురు గ్రహం) నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. శ్రావణ మాసం కూడా ప్రారంభమవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.
1. మేష రాశి (Aries):
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
2. వృషభ రాశి (Taurus):
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది, పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని పనులలో ఒత్తిడి, శ్రమ అధికం కావొచ్చు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
3. మిథున రాశి (Gemini):
ఈ వారం మీకు అన్ని విధాలా కలిసివచ్చే సమయం. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.
4. కర్కాటక రాశి (Cancer):
ఈ వారం కర్కాటక రాశి వారికి అనేక రంగాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. ధనలక్ష్మీ యోగంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు ఈ వారం అనుకూలం.
5. సింహ రాశి (Leo):
ఈ వారం సింహ రాశి వారికి గురు గ్రహం నక్షత్ర సంచారం అత్యంత ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధం బలపడుతుంది.
6. కన్య రాశి (Virgo):
ఈ వారం మీరు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
7. తులా రాశి (Libra):
ఈ వారం మీరు ప్రణాళికాబద్ధంగా పనులు సాగించడం ముఖ్యం. పరిస్థితులు అనుకూలిస్తాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. అపరిచితులను నమ్మకండి. వారం చివరిలో కొన్ని వ్యయప్రయాసలు ఉంటాయి. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి.
8. వృశ్చిక రాశి (Scorpio):
ఈ వారం వృశ్చిక రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ విజయం సాధించే అవకాశాలే ఎక్కువ. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు, ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం ఉంటుంది. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
9. ధనస్సు రాశి (Sagittarius):
ఈ గురు గ్రహం నక్షత్ర సంచారం ధనస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తగ్గుముఖం పడుతాయి. ఉద్యోగాలు చేసే వారికి విజయం లభిస్తుంది. రాబడి సంతృప్తినిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు.
Also Read: శ్రావణ మాసంలో.. మాంసాహారం ఎందుకు తినకూడదు ?
10. మకర రాశి (Capricorn):
ఈ వారం మకర రాశి వారికి ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా.. చివరికి పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు ఉన్నాయి. వారం చివరలో అనారోగ్యం రావచ్చు.
11. కుంభ రాశి (Aquarius):
ఈ వారం కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు అందుతాయి. అయితే.. చిన్న విషయానికి చికాకు పడతారు. ఓర్పుతో మెలగడం మంచిది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి.
12. మీన రాశి (Pisces):
ఈ వారం మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదృష్టం అంతంత మాత్రమే. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలనే తపన పెరుగుతుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం, కుటుంబంలో చికాకులు ఉంటాయి.