Thammudu:గత కొంతకాలంగా హీరో నితిన్ (Nithin ) సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూసిన ఈయన.. ‘తమ్ముడు’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా టైటిల్ కావడంతో కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు సీనియర్ హీరోయిన్ లయ (Laya ) కూడా చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇలాంటి పలు అంశాలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఎట్టకేలకు జూలై 4వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది.
రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం..
ముఖ్యంగా అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని, నితిన్ కెరియర్ గాడిన పడుతుందని అనుకున్న వారికి నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తే కేవలం రూ. 10 కోట్లు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన తమ్ముడు మూవీ..
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ తమ్ముడు సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్(Netflix ) లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది అని నెట్ ఫ్లిక్స్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఒక పోస్ట్ షేర్ చేస్తూ..”తన లక్ష్యాన్ని, అక్కను తిరిగి తేవడానికి ఈ తమ్ముడు మిషన్ పై ఉన్నాడు. ఆగస్టు ఒకటి నుంచి తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం లో తమ్ముడు మూవీని నెట్ఫ్లిక్స్ లో చూడండి” అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అటు థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఇటు ఓటీటీలో ఏ మేరకు రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ALSO READ: Akhanda 2: అఖండ 2 విడుదలపై సందిగ్ధత.. రాజాసాబ్ డేట్ కి ఎసరు!
తమ్ముడు సినిమా విశేషాలు..
ఇక తమ్ముడు సినిమా నటీనటుల విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నితిన్ సరసన సప్తమి గౌడ, వర్షా బొల్లమ్మ తదితరులు నటించారు. నితిన్ కి ఈ సినిమాలో లయ అక్కగా నటించింది. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు? అనే స్టోరీ లైన్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి కేవలం రూ.8 కోట్లు మాత్రమే రాబట్టడం గమనార్హం. మరి ఓటీటీ లోనైనా ఈ సినిమా సత్తా చాటుతుందేమో చూడాలి.
Thana lakshyanni, akkani thirigi thevadaniki ee thammudu is on a mission!
Watch Thammudu on Netflix, out 1 August in Telugu, Tamil, Malayalam and Kannada.#ThammuduOnNetflix pic.twitter.com/5mAUQ9GXwY— Netflix India South (@Netflix_INSouth) July 27, 2025