Tulsi Plant: సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసిని హరిప్రియ అని కూడా అంటారు. విష్ణువు, లక్ష్మీ దేవి తులసి లేని నైవేద్యాన్ని స్వీకరించరని చెబుతారు. హిందూ మత గ్రంధాలలో తులసి పూజనీయమైనదిగా పరిగణించబడుతుంది.
అపవిత్ర స్థితిలో తులసిని తాకడం లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురి చేస్తుందిని చెబుతారు. అందుకే పొరపాటున కూడా మురికి బట్టలు ఆరబెట్టుకుని, చెప్పులు వేసుకుని తులసి మొక్క దగ్గరికి వెళ్లకండి. అంతే కాకుండా రోజు తులసి దీపం వెలిగిస్తే నరక విముక్తి లభిస్తుంది.
ప్రతిరోజు సాయంత్రం పూట తులసిపై దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల నరకం నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. తులసికి దీపం వెలిగించిన తర్వాత తులసి బృందానికి మూడుసార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం , శాంతి కలుగుతాయి. ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు సమర్పించవద్దు. తులసి ఆకులను కూడా తెంపకూడదు. ఇది లక్ష్మీదేవి ఆగ్రహాన్ని కలిగిస్తుంది.
తులసి చెట్టు ఎండిపోతే ఏమి చేయాలి ?
స్కంద పురాణం ప్రకారం, పాత పువ్వులు , పాత నీటితో పూజించడం దేవతలను అవమానించడమే. కానీ తులసి దళం విషయంలో అలా కాదు. ముందుగా తీసిన తులసి ఆకులు, ముందుగానే నిల్వ చేసిన గంగాజలం పాతవి లేదా అశుద్ధంగా పరిగణించబడవు. కాబట్టి వాటిని పూజలో ఉపయోగించవచ్చు.
తులసి ఆకులలో సుఖ దుఃఖాల సూచనలు కనిపిస్తాయా ?
మీ ఇంట్లో తులసి మొక్క ఉండి.. రోజు నీళ్లు పోసి కూడా ఎండిపోతుంటే మీ ఇంట్లో కలగబోయే దుఃఖానికి ఇది సంకేతం. అందువల్ల, తులసి ఎండిపోకుండా రక్షించడానికి, తులసి యొక్క మూలానికి పసుపు , గంగాజలం సమర్పించండి. ఈ రెమెడీని అనుసరించడం వల్ల తులసి మొక్క ఎప్పటికీ ఎండిపోకుండా ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించండి. రోజు నీరు పోయండి. తులసి మొక్కను సూర్యకాంతిలో ఉంచండి. మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించండి. రోజు 3, 5, 7 సార్లు ప్రదక్షిణ చేస్తే ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మురికి చేతులతో తులసి మొక్కను ఎప్పుడూ తాకవద్దు.
ఏకాదశి , పూర్ణిమ, ఆదివారం నాడు తులసి దళాన్ని తెంపకూడదు. పీరియడ్స్ సమయంలో స్త్రీలు తులసి మొక్కను తాకకూడదు.
Also Read: శని సంచారం..ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి
తులసిని ఇలా పూజించండి:
శుభ్రమైన ప్రదేశంలో ఒక కుండీలో తులసి మొక్కను నాటండి. తర్వాత నీరు అందించి కుంకుమ సమర్పించండి. పూల దండను కూడా సమర్పించండి. చెట్టు ముందు దేశీ నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి రోజు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అంతే కాకుండా పండ్లు, స్వీట్లు మొదలైనవి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి వేద మంత్రాలను పఠిస్తూ ప్రార్థించండి. చివరగా హారతితో మీ పూజను పూర్తి చేయండి. పూజ సమయంలో చేసిన తప్పులకు క్షమించమని అడగండి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)