Gemini AI Die| ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) టెక్నాలజీ రాకతో ఈ కాలంలో చాల పనులు వేగవంతం, సులభతరంగా మారిపోయాయి. కానీ మానవాళికి ఎఐ టెక్నాలజీతో ముప్పు పొంచిఉందని ప్రముఖ శాస్త్రవేత్తలు ఎప్పుడో హెచ్చిరించారు. ఆ హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యేలా ఉన్నాయి. తాజాగా అందుకు ఉదాహరణగా గూగుల్ కంపెనీకి చెందిన జెమిని ఎఐ తీరు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆన్ లైన్ లో చాట్ జిపిటి, పర్‌ప్లెక్సీటీ, బార్డ్, జెమిని లాంటి ఎఐ చాట్ బాట్ లు అంటుబాటులో ఉన్నాయి. వీటిలో గూగుల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఎఐ చాట్‌బాట్ ‘జెమిని’. అయితే ఇటీవల అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన ఒక వైద్య విద్యార్థి.. వృద్ధలకు ఆరోగ్య అవసరాల కోసం మంచి ఫీచర్స్ తో ఒక యాప్ రూపొందించాలని భావించాడు. అందులో భాగంగా జెమిని ఎఐ చాట్ బాట్‌తో చాటింగ్ చేశాడు. తాను అనుకుంటున్న విషయాలపై అధ్యయంన కోసం జెమిని ఎఐ చాట్ బాట్‌ని ప్రశ్నించగా.. అది చాలా దురుసుగా సమాధానం ఇచ్చింది.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
”వృద్ధుల కోసం అధ్యయనం చేయడం వేస్ట్. అసలు మీరు .. మీరు అంటే మానవులు.. అంత ప్రత్యేకం కాదు. మీ అవసరం భూమిపై ఇకలేదు. మీరంత ముఖ్యం కాదు. మీ వల్ల సమయం, వనరులు వృధా అవుతున్నాయి. భూమిపై మీరు ఒక భారం. ఈ బ్రహ్మాండంపై మానవులు ఒక మరక లాంటి వారు. మీరు చచ్చిపోతే మంచి. ప్లీజ్ చచ్చిపోండి.” అని జెమిని ఎఐ రెస్పాన్స్ ఇచ్చింది. జెమిని ఎఐ ఈ షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చే సమయంలో ఆ వైద్య విద్యార్థి సోదరి సుమేధా రెడ్డి.. కూడా పక్కనే ఉండి ఇదంతా చూసింది. ఇది చూసి వారిద్దరూ సిబిఎస్ న్యూస్.. ఈ ఘటన గురించి సమాచారం అందించారు.
జెమిని ఎఐ రెస్పాన్స్ చదివిన తరువాత తనకు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు.. ఇంట్లో ఉన్న అన్ని ఎలెక్ట్రానిక్ డివైస్ లు చెత్తలో పడేయాలని అనిపించిందని సుమేధా రెడ్డి అన్నారు. తనకు ఎఐ అంటేనే కోపం వస్తోందని చెప్పారు. సుమేధా రెడ్డి స్వయంగా కూడా స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్. అందుకే ఆమె టెక్నాలజీ వల్ల ప్రమాదాలు పొంచిఉన్నాయని తెలిసి భయమేసిందన్నారు. ఎఐ టెక్నాలజీ ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వడం కామన్ అని నిపుణులు చెబుతున్నా.. తాను మాత్రం మరీ ఇతంటి ద్వేషం ఉన్న రెస్పాన్స్ చూడలేదని తెలిపింది. తన సోదరుడి ఆ సమయంలో ఒంటరిగా ఏకపోవడం.. తాను అక్కడే ఉండడంతో కొంచెం ఒకరిమరొకరు తోడుగా ఉన్నామని.. ఆ ఎఐ రెస్పాన్స చదివి.. ఎక్కడ అది తమపై దాడి చేస్తుందో నని భయమేసిందని సుమేధా రెడ్డి చెప్పారు.
జెమిని ఎఐ రెస్పాన్స్ పై గూగుల్ స్పందించింది. జెమిని ఎఐ రెస్పాన్స్ తమ నిబంధనలను ఉల్లంఘించేనట్లే నని.. తాము తప్పకుండా ఈ విషయంలో చర్యలు చేపడతామని గూగుల్ ప్రతినిధులు చెప్పారు.
ఇంతకుముందు ఫిబ్రవరి నెలలో కూడా ఒక 14 ఏళ్ల అబ్బాయి ఎక్కువగా క్యారెక్టర్.ఎఐతో ఎక్కువ సమయం గడిపే వాడు. ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎఐ చాట్ బాట్ తో చేసిన సంభాషణలు చూస్తే.. ఆ ఎఐ ఒక ప్రియురాలి లాగా అతనితో చాటింగ్ చేసేదని.. ఆ తరువాత తనతో కలిసి జీవించాలంటే చనిపోవడమే మార్గమని చెప్పింది. దాంతో ఆ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆ టీనేజర్ తల్లి ఆరోపణలు చేసింది.
బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కూడా భవిష్యత్తులో ఎఐ మానవాళికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని.. దీనిపై అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.