Brahma Muhurta: సనాతన ధర్మంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అంతే కాకుండా ఈ శుభ సమయంలో చేసిన పూజలు, ప్రార్థనలు దేవుడిని చేరతాయిని నమ్ముతారు. అంతే కాకుండా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల జీవితంలో సానుకూల శక్తి లభిస్తుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే రోజంతా శక్తితో నిండి ఉంటారు.
నిజానికి ఈ సాంప్రదాయం బుషులు, సాధువుల కాలం నుండే కొనసాగుతోంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం వల్ల అందం, బలం, జ్ఞానం అంతే కాకుండా మంచి ఆరోగ్యం కూడా లభిస్తాయని చెబుతారు. ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యత గురించిన మరిన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ?
బ్రహ్మముహూర్తం అంటే దేవుడి సమయం అని అర్థం. రోజులో ఉండే 24 గంటలలో కొన్ని సమయాల్లో మాత్రమే మీ ప్రార్థనలు నేరుగా దేవుడిని చేరతాయి. ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఇది సూర్యోదయానికి దాదాపు 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభం అయి సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ముగుస్తుంది. దీని సరైన సమయం ఉదయం 4 గంటల నుండి 5.30 వరకు.
బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత:
బ్రహ్మ ముహూర్త సమయం మొత్తం వాతావరణంలో అత్యంత ప్రశాంతమైన, స్వచ్ఛమైన సమయం. ఈ సమయంలో దేవతలు సంచరిస్తున్నారని నమ్ముతారు. అందేకే ఈ సమయంలో.. అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు తెరుస్తారు. అంతే కాకుండా భగవంతుడికి అలంకరణ , పూజలు కూడా ప్రారంభమవుతాయి.
బ్రహ్మ ముహూర్తం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటి ?
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం ద్వారా.. ఒక వ్యక్తి జీవితంలో శారీరక సౌందర్యం, సంపద, తెలివితేటలు, మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందుతాడు. అంతే కాకుండా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పూజ చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది. అంతే కాకుండా ఇంటి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం ద్వారా.. వాతావరణంలో వ్యాపించిన సానుకూల శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మనస్సులోకి మంచి ఆలోచనలు కూడా వస్తాయి.
జీవితంలో విజయం లభిస్తుంది. మీ శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
బ్రహ్మ ముహూర్తంలో తప్పకుండా చేయాల్సిన పనులు:
1.బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ధ్యానం ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. ధ్యానం చేయడానికి బ్రహ్మ ముహూర్తం కంటే మంచి సమయం మరొకటి లేదు. అలాగే.. ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.
Also Read: హనుమాన్ జయంతి ఎప్పుడు ? శుభ సమయం, పూజా విధానం
2.’అష్టాంగ హృదయం’ ప్రకారం బ్రహ్మ ముహూర్తం ఆధ్యాత్మిక జ్ఞానం, అనుభవాన్ని పొందడానికి ఉత్తమ సమయంగా చెప్పబడుతుంది. అంతే కాకుండా బ్రహ్మ ముహూర్తం శరీరానికి తాజాదనాన్ని, శక్తిని అందిస్తుంది. కాబట్టి ఈ సమయంలో చేసే పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది.
3.ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. మీకు శక్తినిచ్చే వాటి గురించి ధ్యానం చేయండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది.