BigTV English

16 Years For Billa : సినిమా రిజల్ట్ తేడా కొట్టిన, స్టైలిష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు

16 Years For Billa : సినిమా రిజల్ట్ తేడా కొట్టిన, స్టైలిష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు

16 Years For Billa : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ లో మెహర్ రమేష్ ఒకరు. కంత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మెహర్. మెహర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక సరైన హిట్ సినిమా కూడా లేదు అని చెప్పాలి. అయితే మెహర్ చేసిన అన్ని సినిమాలలో కంటే బిల్లా సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం. ఈ సినిమాలో ప్రభాస్ ని చూపించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆడకపోయిన కూడా పరవాలేదు అని అనిపించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాలో అనుష్క బికినీలో కనిపిస్తుంది అని అప్పట్లో వార్తలు వినిపించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


స్టైలిష్ గా చూపించాడు

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు కీలకపాత్రలో కనిపించారు. అనుష్క తో పాటు నమిత, హన్సిక ప్రధాన పాత్రలగా ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు నిరాశ మాత్రం తప్పలేదు. కానీ ప్రభాస్ లో ఉన్న కామెడీ టైమింగ్ ను పర్ఫెక్ట్ గా చూపించాడు మెహర్. ఇక ఒకప్పుడు రిలీజ్ అయిన సినిమాలు సరైన ఆదరణ దక్కించుకోకపోయినా కూడా రీసెంట్ టైమ్స్ లో రీ రిలీస్ అవుతున్నప్పుడు మాత్రం ఆ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది. అలానే బిల్లా సినిమా కూడా మంచి ఆదరణ లభించింది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మొత్తానికి ఈ సినిమా వచ్చి నేటికి 16 ఏళ్లు పూర్తయింది. అంతమందికి నచ్చకపోయినా కొంతమందికి మాత్రం ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.


ఒక్క హిట్ సినిమా కూడా లేదు

దర్శకుడు మెహర్ రమేష్ విషయానికి వస్తే దాదాపు ఒక ఐదు డిజాస్టర్ సినిమాలు చేసిన కూడా ఈ దర్శకుడికి ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మెహర్ ముందుగా బాబి అనే సినిమాలో నటుడుగా కనిపించాడు. ఆ తర్వాత తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలను దర్శకుడుగా తెరకెక్కించాడు. అయితే తెలుగులో మాత్రం ఎన్టీఆర్ తో మొదటి సినిమాను చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. కంత్రి సినిమా ఫెయిల్ అయిన కూడా శక్తి సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. ఒక శక్తి సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా మన శక్తి సరిపోదు అని చెప్పాలి. ఆ సినిమాతో వైజయంతి బ్యానర్ ఆల్మోస్ట్ కనుమరుగైపోతుంది అనుకుని స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ప్రస్తుతం ఆ బ్యానర్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం.ఈ సంస్థలో వచ్చిన కల్కి సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా ఈ బ్యానర్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

Also Read : Jack Movie: మెగా ప్రిన్స్ చేసిన పాపం సిద్దును చుట్టుకుందా..? ఫిలిం ఛాంబర్‌కి ఎక్కిన పంచాయితీ

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×