Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ (NTR) ‘దేవర’ (Devara) జపాన్ వెర్షన్ రిలీజ్ సందర్భంగా అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. అందులో ఎన్టీఆర్ వచ్చే జన్మలో ఆయన ఏం కావాలని కోరుకున్నారో వెల్లడించారు. ఇంతకీ మరో జన్మలో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు? ఆయన కోరిక ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
మరో జన్మలో ఆ కోరిక తీర్చుకుంటానన్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఇన్ని రోజులూ జపాన్లోనే ఉన్నారు. మార్చ్ 28న ఈ మూవీ అక్కడ రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ ఎన్టీఆర్ ఇంకా అక్కడే ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోటోలు, వీడియోలు, ‘దేవర’ మూవీకి జపాన్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జపాన్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఒకవేళ మళ్లీ పుడితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు?” అనే ప్రశ్నకి ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు.
“ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నేను ప్రపంచంలోనే బెస్ట్ చెఫ్ అవుతాను. అది కూడా అద్భుతమైన సూషీ వండగల చెఫ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సూషి నా ఫేవరెట్ ఫుడ్” అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ మెచ్చిన హైదరాబాదీ రెస్టారెంట్స్
ఇప్పటికే ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కి వచ్చేసారు. అయినప్పటికీ జపాన్ టూర్ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జపాన్ కాబట్టి ఎన్టీఆర్ తనకు సూషీ అంటే ఇష్టమని చెప్పారు. అందులోనూ నాగ చైతన్య రెస్టారెంట్ షోయూ గురించి మాట్లాడారు. “ఈ అద్భుతమైన ప్లేస్ నా ఫ్రెండ్ నాగచైతన్య ది. అందులో కొన్ని బెస్ట్ జపనీస్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. సూషీ అయితే భలే ఉంటుంది. హైదరాబాద్ లో జపనీస్ వంటకాలకు, అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్ అడ్రస్ నాగచైతన్య రెస్టారెంట్” అంటూ ఆయన కొనియాడారు.
మరి ఎన్టీఆర్ కు ఇష్టమైన హైదరాబాద్ రెస్టారెంట్లు ఏంటో తెలుసా? ఈ విషయాన్ని కూడా ఆయన ఇదే ఇంటర్వ్యూలో వెల్లడించారు. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్ లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్ పేట్ లోని కాకతీయ డీలక్స్ మెస్ లాంటి రెస్టారెంట్లో తనకు ఫుడ్ నచ్చుతుందని కామెంట్ చేశారు.
కాగా త్వరలోనే ఎన్టీఆర్ ‘దేవర’ ఫీవర్ నుంచి బయటకొచ్చి, ‘వార్ 2’ షూటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే ఇదే నెలలో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి, ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్ సెట్లో జాయిన్ కానున్నారు. ఈ మూవీ అప్డేట్ గురించే నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.