Akshaya Tritiya 2025: ఈ సంవత్సరం అక్షయ తృతీయ బుధవారం 30 ఏప్రిల్ 2025న జరుపుకోనున్నాము. అక్షయ తృతీయ శుభ సందర్భంగా చాలా మంది బంగారం, వెండి, వాహనాలు, మొదలైన వాటిని కొనుగోలు చేస్తారు. కానీ మీరు వీటిని కొనలేకపోతే, అస్సలు బాధపడకండి. అక్షయ తృతీయ రోజు ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకువస్తే ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.
పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం అక్షయ తృతీయ బుధవారం, 30 ఏప్రిల్ 2025న జరుపుకుంటారు. ఇదే రోజున గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. గజకేసరి యోగంతో పాటు మాళవ్య, రవియోగ, చతుర్గ్రాహి, సర్వార్థ సిద్ధి, లక్ష్మీ నారాయణ రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ శుభ యాదృచ్చిక సంఘటనలన్నింటి సృష్టి కారణంగా.. ఈ అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. కాబట్టి.. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు.
సనాతన ధర్మంలో.. అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఏ శుభ కార్యమైనా సమయం చూసుకోకుండా చేయవచ్చు. అంతే కాకుండా ఈ రోజున దానధర్మాలు చేయడం , విలువైన వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది.
అక్షయ తృతీయ నాడు ఏమి కొనాలి ?
సాధారణంగా.. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వంటి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కానీ అధిక ధర కారణంగా వీటిని కొనలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిలో.. మీరు గవ్వలు, తులసి, పసుపు ఆవాలు, రాతి ఉప్పు, బార్లీ, పత్తి , శ్రీ యంత్రం మొదలైన వాటిని కొనుగోలు చేయవచ్చు. ఇది కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Also Read: మే నెలలో వీరికి ధనలాభం, 4 రాశుల వారికి మాత్రం కష్టాలు తప్పవు
అక్షయ తృతీయ నాడు ఏం దానం చేయాలి ?
అక్షయ తృతీయ శుభ సమయంలో.. మీరు ఐదు పసుపు ముద్దలు, ఏడు రకాల ధాన్యాలను దానం చేయాలి. దీంతో పాటు.. మతపరమైన పుస్తకాలు, జపమాల, దేవుని బట్టలు, నెమలి ఈక, ఠాకూర్జీ వేణువు, పండ్లు, కూరగాయలు కూడా దానం చేయవచ్చు. ఇది శుభప్రదంగా భావిస్తారు. ఇది మాత్రమే కాదు మీరు ఈ రోజున కుండ, ఫ్యాన్, బూట్లు , చెప్పులు కూడా దానం చేయవచ్చు.