BigTV English
Advertisement

Alcohol:ఏడాదికోసారి మద్యం పంచే ఆలయం ఎక్కడుంది ?

Alcohol:ఏడాదికోసారి మద్యం పంచే ఆలయం ఎక్కడుంది ?

Alcohol:మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇతర మతాల నమ్మకాలను పద్ధతులకు కూడా గౌరవం ఇస్తారు. ఇతర దేశాల్లో లేని విధంగా అనేక మతాలు, కులాలు ,ఆచారాలు సాంప్రదాయాలు, సంస్కృతులు పాటిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వింత సాంప్రదాయాలు వింత పద్ధతులు కూడా ఉంటాయి. కానీ వీటి వెనుక ఏదో ఒక కచ్చితమైన కారణం ఉంటుంది. అమృత్ సర్ లో ఒక దేవాలయంలో భక్తులకు ప్రసాదంగా మద్యం ఇస్తారు. దాదాపుగా 90 సంవత్సరాలుగా ఒక వింత ఆచారం పాటిస్తారు. అక్కడ బాబా రోడే షా ఆలయం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. జాతర సమయంలో భక్తులకు మద్యాన్ని పంచుతారు.


అయితే ఈ భిన్నమైన ఆచారాన్నిచూడాలంటే పతేగడ్ ప్రాంతంలోని చూరియన్ రోడ్డు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా భక్తులకు మద్యాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. ఇందులో భాగంగా భక్తులు మద్యాన్ని స్వామివారికి అర్పిస్తారు. . ధావన్ గ్రామిక గ్రామానికి చెందిన ఒక బాబా 1896 లో తన కుటుంబాన్నివిడిచి భోమాలో స్థిరపడ్డారు. అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆయనకు ఎవరు లేరు.

ఒక రోజు సమీప గ్రామంలోని రైతు వచ్చి .. సంతానం తనకు లేదని ఆయన దగ్గర మొర పెట్టుకున్నారు. బాబాను దర్శించుకున్న కొన్నిరోజులకే రైతు కోరిక నెరవేరింది. దీంతో అతను ఆనందంతో బాబా దగ్గరకు వచ్చాడు. మీకు ఎదైనా ఇవ్వాలను కుంటున్నట్లు చెప్పాడు. దానికి బాబా.. మద్యాన్ని ఇవ్వమని చెప్పారు. అదే విధంగా ఆ మద్యాన్ని అక్కడికి వచ్చే భక్తులకు తిరిగి ప్రసాదంగా పంచిపెట్టే వారు. ఆయన ఏనాడు మద్యం తాగలేదు. ఇలా ఆయన ప్రారంభించారు. క్రమేపీ ఇది ఆనవాయితీగా మారింది. ఏడాదికోసారి జాతర నిర్వహించేసమయంలో మాత్రమే మద్యాన్ని ప్రసాదంగా భక్తులకి పంచి పెడుతుంటారు.అక్కడికి వెళ్లి ఏం కోరుకున్నా.. నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మొదట్లో ఆలయంలో పురుషులు,మహిళలకు దర్శనానికి వెర్వేరు రోజులు ఉండేవి.


Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×