E-Paper
Advertisement

Nantianmen Project China: హాలీవుడ్ రేంజ్ హంగామా.. చైనా ‘స్పేస్ క్యారియర్’ ప్రపంచ దేశాలకు హెచ్చరికా.. లేక మైండ్ గేమా?

Nantianmen Project China: హాలీవుడ్ రేంజ్ హంగామా.. చైనా ‘స్పేస్ క్యారియర్’ ప్రపంచ దేశాలకు హెచ్చరికా.. లేక మైండ్ గేమా?

Nantianmen Project China: మనం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన భారీ అంతరిక్ష యుద్ధనౌకలు.. ఇప్పుడు నిజం కాబోతున్నాయా? భూమిపై ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్న అగ్రరాజ్యాల పోరు, ఇప్పుడు నింగికి చేరిందా? అంటే చైనా తాజాగా విడుదల చేసిన విజువల్స్ అవుననే చెబుతున్నాయి. నంతియాన్ మెన్.. అనే పేరుతో చైనా చేపట్టిన ఒక రహస్య ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గాలిలో తేలియాడే ఒక భారీ కోట.. సముద్రపు నౌకల కంటే పది రెట్లు పెద్దదైన యుద్ధ విమానం.. కంటికి కనిపించని వేగంతో దూసుకెళ్లే క్షిపణులు! ఇవన్నీ కలిపి చైనా సృష్టిస్తున్న ఆ మాయాజాలం ఏంటి?

అంతరిక్షంలో చైనా కొత్త యుద్ధ ప్రభంజనం

ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు భూమిని దాటి అంతరిక్షానికి చేరుకుంది. నిన్నటి వరకు అమెరికా, రష్యాల మధ్య సాగిన స్పేస్ రేస్‌లోకి ఇప్పుడు చైనా ఒక భయం కలిగించే ఆయుధంతో ఎంట్రీ ఇచ్చింది. అదే నంతియాన్ మెన్. తెలుగులో దీని అర్థం దక్షిణ స్వర్గ ద్వారం. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా రూపొందిస్తున్న ఈ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, అంతరిక్షం నుండే ప్రపంచాన్ని శాసించగల ఒక ఫ్లయింగ్ కోట.

ఆకాశ యుద్ధానికి సిద్ధం అయిన ‘లువానియావో

కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యాలను ఇప్పుడు చైనా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆకాశంలోనే ఉండి యుద్ధం చేయగల నంతియాన్ మెన్ అనే ఒక భారీ విమాన వాహక నౌకను చైనా రూపకల్పన చేస్తోంది. దీనికి లువానియావో అని పేరు పెట్టారు. ఇటీవల చైనా ప్రభుత్వ వార్తా సంస్థ CCTV.. దీనికి సంబంధించిన ఫోటోరియలిస్టిక్ దృశ్యాలను విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

చైనా వాయుసేనకు మించిపోయి

చైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా 2017లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టు ఆలోచనను బయటపెట్టింది. అప్పటి నుండి అంచలంచెలుగా నమూనాలను ప్రదర్శిస్తూ వచ్చిన బీజింగ్, తాజాగా చైనా స్టేట్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇది కేవలం వాయుసేన కోసం మాత్రమే కాదు, ఎయిర్-స్పేస్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ కోసం చైనా వేస్తున్న భారీ అడుగుగా అంచనా వేస్తున్నారు.

చైనా విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నౌక పరిమాణం వింటేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఈ భారీ విమానం పొడవు 242 మీటర్లు కాగా, రెక్కల వెడల్పు ఏకంగా 684 మీటర్లు. సుమారు 1,20,000 టన్నుల బరువుండే ఈ నౌక, సముద్రంపై ప్రయాణించే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ల కన్నా బరువైంది.

హాలీవుడ్ ఎఫెక్ట్.. గగనతలంలో చైనా యుద్ధనౌకలు

ఈ నౌక నుండి క్సువాన్ ను అనే మానవరహిత అంతరిక్ష ఫైటర్ జెట్లను ప్రయోగించవచ్చు. అలాగే భూమిపై ఉన్న లక్ష్యాలను, అంతరిక్షంలోని శత్రువులను ధ్వంసం చేసే హైపర్‌సోనిక్ క్షిపణులు దీని సొంతం. భూమిపై ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా క్షణాల్లో ధ్వంసం చేయగల హైపర్‌సోనిక్ క్షిపణులు, లేజర్ గన్‌లతో ఇది నిండి ఉంటుంది.

ప్రపంచాధిపత్యం కోసం చైనా వేస్తున్న అడుగులు ఇప్పుడు భూమిని దాటి అంతరిక్షానికి చేరాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలను తలపించేలా, గగనతలంలో తేలియాడే భారీ యుద్ధనౌక లువానియావో విజువల్స్‌ను చైనా విడుదల చేయడంతో రక్షణ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ నంతియాన్ మెన్ ప్రాజెక్ట్ నిజంగా సాధ్యమేనా? లేక శత్రువుల మెదళ్లతో చైనా ఆడుతున్న మైండ్ గేమా?

ప్రపంచ రక్షణ వర్గాల్లో ఆందోళన

చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన నంతియాన్ మెన్ ప్రాజెక్ట్.. అందులోని లువానియావో అంతరిక్ష యుద్ధనౌక ఇప్పుడు ప్రపంచ దేశాల రక్షణ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని గ్రాఫిక్స్‌ను తలపిస్తున్న ఈ భారీ నౌక విజువల్స్ చూస్తుంటే.. యుద్ధ తంత్రం భూమిని దాటి నింగికి చేరిందని స్పష్టమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు నిజానిజాలపై ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.

భౌతిక శాస్త్ర పరిమితులపై సవాళ్లు

చైనా స్టేట్ మీడియా CCTV విడుదల చేసిన వివరాల ప్రకారం.. లువానియావో పొడవు 242 మీటర్లు, వెడల్పు 684 మీటర్లు, బరువు ఏకంగా 1.2 లక్షల టన్నులు. ప్రస్తుతం సముద్రంపై ఉన్న అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల కంటే ఇది పది రెట్లు పెద్దది. అయితే భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఇంత భారీ నిర్మాణాన్ని భూమి అంచున నిలపడం ప్రస్తుతానికి అసాధ్యం అని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

శాస్త్రీయ ఊహలకీ పరిమితమైన ఖర్చులు

లక్ష టన్నుల బరువును గాలిలో నిలపడానికి కావాల్సిన శక్తివంతమైన ఇంజన్లు గానీ, అందుకు అవసరమైన న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్లు గానీ ఇంకా ప్రయోగశాలలకే పరిమితమయ్యాయని అంటున్నారు. ఇటువంటి ఒక నౌకను నిర్మించేందుకు అయ్యే ఖర్చు ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చగలదని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇది ప్రస్తుతానికి చైనా శాస్త్రవేత్తల ఊహ మాత్రమే అని మెజారిటీ నిపుణులు భావిస్తున్నారు.

చైనా హడావుడి వెనుక ఉన్న పురాతన వ్యూహం

చైనా చేస్తున్న ఈ హడావుడి వెనుక 1980ల నాటి అమెరికా వ్యూహం దాగి ఉందనే బలమైన వాదన కూడా వినిపిస్తోంది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ అంటే.. స్టార్ వార్స్ అనే పథకాన్ని ప్రకటించారు. అంతరిక్షం నుంచే సోవియట్ క్షిపణులను కూల్చేస్తామని అమెరికా నమ్మించింది. నిజానికి అప్పట్లో అమెరికా దగ్గర ఆ టెక్నాలజీ లేదు. కానీ అది కేవలం సోవియట్ యూనియన్‌ను భయపెట్టడానికి ఈ ఎత్తుగడ వేసింది.

అమెరికా ఆయుధ భయాల వెనుక చైనా వ్యూహమా?

అమెరికా మాటలను నమ్మి ఆందోళన చెందిన సోవియట్ యూనియన్.. ఆ కల్పిత ఆయుధాన్ని అడ్డుకోవడానికి తన రక్షణ బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేసి ఆర్థికంగా కుప్పకూలిపోయింది. ఇప్పుడు చైనా కూడా అదే బాటలో అమెరికాను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైందన్న వాదన వినిపిస్తోంది. లువానియావో వంటి అసాధ్యమైన ఆయుధాలను చూపిస్తూ అమెరికాను అనవసరపు రక్షణ ఖర్చుల్లోకి నెట్టడం బీజింగ్ పన్నాగం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ భద్రతపై చైనా సాంకేతిక సవాళ్లు

ఇక లువానియావో అనే భారీ నౌక రాకపోయినా.. ఈ ప్రాజెక్ట్ నెపంతో చైనా అభివృద్ధి చేస్తున్న ఇతర సాంకేతికతలు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవని అంటున్నారు. శత్రువు రాడార్లను తప్పుదోవ పట్టించే ఫాంటమ్ స్పేస్ స్ట్రైక్, హైపర్‌సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు వాస్తవ యుద్ధంలో గేమ్ ఛేంజర్స్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. 2045 నుండి 2055 మధ్యలో ఈ ప్రాజెక్టు పూర్తి కావచ్చని చైనా చెబుతుండగా..ఇది సాధ్యం కాదంటున్నారు. చైనా ప్రకటనల వెనుక 10 శాతం వాస్తవం ఉన్నా.. అది ప్రపంచ భద్రతకు పెను సవాల్ అని అంటున్నారు.

చైనా ఆకాశ కోట vs అమెరికా.. అంతరిక్షంలో శక్తి సమీకరణ

లువానియావో ఆకాశంలోకి ఎగురుతుందా లేదా అన్నది పక్కన పెడితే.. చైనా మాత్రం తన స్పేస్ మిలిటరైజేషన్ ద్వారా అగ్రరాజ్యం అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక పంపింది. ఈ దక్షిణ స్వర్గ ద్వారం తెరుచుకుంటే.. అది ప్రపంచానికి శాంతిని ఇస్తుందో లేక అంతరిక్ష యుద్ధానికి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. మరి చైనా సృష్టిస్తున్న ఈ ఆకాశ కోటపై అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అన్నది వేచి చూడాలి.

Also Read:  114 రాఫెల్స్.. యుద్ధ విమానాలు సిద్ధం..! ఇక ఊచకోతే!

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×