Ravana:రావణాసురుడిని యుద్ధంలో ఓడించిన రాజు పేరే మాంధాత. యవనాశ్వుని కుమారుడు. భృగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించడంతో యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం. యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. అతడు ఎంతటి బలసాలి అంటే పన్నెండవ సంవత్సరంలోనే రాజ్యానికి రాజుగా రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు ఓడించాలని నిర్ణయించుకుంటాడు.
తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు. రావణుడు అనుకున్నట్లుగానే యుద్ధానికి దిగుతాడు. మాంధాతతో భీకరమైన యుద్ధం రోజుల తరబడి జరుగుతూనే ఉఁటుంది . ఎలాగైనా మాంధాతను ఓడించాలనే లక్ష్యంతో ముందుగానే ఏర్పరుచుకున్న పథకాలను రావణుడు అమలు చేస్తాడు . కానీ అవేమీ మాంధాత చెల్లవు. ఎన్నిరకాలుగా ప్రయత్నించిన రావణుడు ఓడించలేకపోయాడు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండానే యుద్ధాన్ని చేస్తూనే ఉంటాడు
చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓడిపోతాడు. ప్రత్యర్ధి బలమేంటో రావణుడు కొంచెంకూడా అంచనా వేయలేక చతికలపడతాడు. అయితే ఇంతలోనే బ్రహ్మ, ఇంద్రుడు జోక్యంచేసుకుని మంధాత, రావణునికీ మధ్య సంధి కుదుర్చుతారు. దాంతో ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.