Left Wrist watch: మనిషి జీవితం ఒక్కో క్షణాన్ని లెక్కపెడుతూనే సాగుతుంది. ఆ క్షణాల విలువను తెలుసుకునే క్రమంలో గడియారం కనుగొన్నారు. గడియారం మనిషి అవసరం నుంచి పుట్టింది. మొదట కాలాన్ని కేవలం చూడటానికే వాడతే, ఇప్పుడు గోడ గడియారం నుంచి చేతికి పట్టుకునే వాచ్ లాగా వచ్చింది. అది ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్ పరికరంగా మారింది. అలా చిన్నతనం నుంచి వాచ్ వేయడం చూసి వచ్చాం. కానీ ఒకటి మాత్రం ప్రశ్నార్థంగా మారింది. అదే మనం వాచ్‌ని ఎడమచేతికే ఎందుకు వేసుకుంటాం? కుడిచేతికి ఎందుకు కాదు? ఈ సాధారణమైన అనుమానానికి వెనుక ఎన్నో ఆసక్తికరమైన కారణాలున్నాయి.
ఇది అలవాటుగా మారిపోయిన విషయం అయినా, దీని వెనక చరిత్ర ఉంది. వాచ్‌లు మొదటిసారిగా పేద్దల జీవితాల్లోకి వచ్చినప్పుడు అవి ముఖ్యంగా యుద్ధ సమయంలో ఉపయోగించేవారు. సైనికులకు రెండు చేతులూ అవసరం. కుడిచేతితో తుపాకీ పట్టే అవసరం ఉంటుంది. అందుకే వాచ్‌ను ఎడమచేతికి పెట్టుకునేలా డిజైన్ చేశారు. అప్పటి నుంచి అది ఓ సాంప్రదాయంలా మారిపోయింది. పైగా, ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా కుడిచేతివాళ్లే. వారు వాచ్ వేసుకునే చేతి కదలిక తక్కువగా ఉంటే, ఆ వాచ్ ఎక్కువకాలం వస్తుంది. అందుకే ఎడమచేతికి వాచ్ పెట్టుకునే “లాజికల్” ఓప్షన్ అయింది.
ఇంకొంచెం లోతుగా చూస్తే, వాచ్ వాడే సమయంలో టైమ్ సెట్ చేయాల్సి వస్తుంది. ఆ డయల్ ని తిరగాల్సి ఉంటుంది. మనం కుడిచేతివారు కాబట్టి, ఎడమచేతికి వాచ్ వేసుకుంటే కుడిచేతితో అలా సులభంగా ఆపరేట్ చేయచ్చు. ఇది చిన్న విషయమే అయినా, వినియోగదారుడికి సౌలభ్యం కలిగించేలా తయారీదారులు వాటిని ఎడమ చేతికి తగ్గట్టుగా డిజైన్ చేయడం మొదలెట్టారు. అలానే ఆ డిజైన్, అలవాటు రూపంలో మారిపోయింది.
అయితే ఇది తప్పనిసరి కాదని కూడా మనం గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొందరు కుడిచేతికే వాచ్ పెట్టుకుంటారు. ముఖ్యంగా ఎడమ చేతితో ఎక్కువగా పనులు చేసేవాళ్లు. కానీ ఇక్కడ కొన్ని చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. ఉదాహరణకి, మనం ఎక్కువగా వాడే చేతికి వాచ్ పెట్టుకుంటే అది దెబ్బతిన్నే అవకాశాలు ఎక్కువ. అలాగే స్మార్ట్‌వాచ్‌ల విషయంలోనూ ఒక అవగాహన ఉంటుంది. కొన్ని ఫీచర్లు – స్టెప్ కౌంటర్, హార్ట్ బీట్ సెన్సార్లు వంటివి. వాచ్ చేతి స్థిరత్వం అవసరం. ఎక్కువ కదిలే చేయి అయితే – వాచ్ లోని ఫీచర్లు తప్పుగా పనిచేసే అవకాశం ఉంటుంది.
ఇంకా కొన్ని అభిప్రాయాలు మతపరమైనవీ, జ్యోతిష్యశాస్త్రపరమైనవీ కూడా వినిపిస్తుంటాయి. ఎవరికైనా ఎడమచేతిలో వాచ్ వేసుకుంటే అదృష్టం వస్తుందట, లేక చెడు దూరమవుతుందట. కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే. నిజంగా చెప్పాలంటే, ఇది చరిత్ర, అవసరం, అలవాటు ఈ మూడింటి కలయిక మాత్రమే. ఈ మధ్యకాలంలో వస్తున్న స్మార్ట్‌వాచ్‌లు కుడిచేతికైనా, ఎడమచేతికైనా వాడేలా సెట్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్‌లలో చేతి పక్షాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలుంటాయి. కానీ అది కూడా మన అలవాటు మీదే ఆధారపడి ఉంటుంది. చివరగా, మీరు వాచ్ ఎక్కడ వేస్తున్నారన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. మీరు సమయాన్ని గౌరవిస్తున్నారా? మీరు జీవితాన్ని సవ్యంగా గడుపుతున్నారా? అనేది అసలు విషయం. మనం ఎడమ చేతికైనా కుడిచేతికైనా వాచ్ వేసుకోవచ్చు, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం.