E-Paper
Advertisement

Lord Shiva: గంగా నది జన్మ రహస్యం, శివుడు ఈ నదిని స్వర్గంలోనే ఎందుకు ఉంచలేదు ?

Lord Shiva: గంగా నది జన్మ రహస్యం, శివుడు ఈ నదిని స్వర్గంలోనే ఎందుకు ఉంచలేదు ?
Advertisement

Lord Shiva: గంగానది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నదిగా, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కొలవబడుతోంది. శివుడు తన జటాజూటం (జుట్టు) నుంచి ఈ నదిని భూమిపైకి వదలడం వెనుక ఒక గొప్ప పౌరాణిక కథ, మానవాళికి సంబంధించిన మహత్తర ఉద్దేశం దాగి ఉన్నాయి.

భగీరథుడి తపస్సు:
సూర్యవంశానికి చెందిన పుణ్య చరిత్ర కలిగిన రాజు సగరుడు. ఆయనకు 60 వేల మంది కుమారులు ఉండేవారు. ఒకసారి సగరుడు అశ్వమేధ యాగం తలపెట్టగా, ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేస్తాడు. సగర కుమారులు గుర్రం కోసం వెతుకుతూ కపిల మహర్షిని అపార్థం చేసుకుని.. ఆయనపై దాడి చేయబోతారు. కపిల మహర్షి కోపోద్రిక్తుడై వారిని తన తపోశక్తితో భస్మం చేస్తారు. ఆ 60 వేల మంది ఆత్మలకు మోక్షం లభించాలంటే.. పరమ పవిత్రమైన గంగా నది నీరు వారి భస్మంపై ప్రవహించాల్సి ఉంటుంది. సగర చక్రవర్తి కుమారుడు అంతుమన్‌, ఆ తరువాత అతని కుమారుడు దిలీపుడు ఎంత ప్రయత్నించినా గంగను భూమికి తీసుకురాలేకపోయారు. చివరకు దిలీపుడి కుమారుడైన భగీరథుడు ఈ కష్టమైన కార్యాన్ని తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Advertisement

గంగా అవతరణ, శివుడి పాత్ర:
భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించడానికి.. గంగాదేవిని భూమిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. భగీరథుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు, గంగా దేవిని భూమికి పంపడానికి అంగీకరిస్తాడు. అయితే.. గంగా నది దివ్యత్వం, దాని ప్రవాహం యొక్క వేగం, శక్తి అపారమైనవి. స్వర్గం నుంచి నేరుగా భూమిపైకి దూకితే, ఆ ప్రవాహం యొక్క తాకిడికి భూమి విచ్ఛిన్నమయ్యే (నాశనమయ్యే) ప్రమాదం ఉందని దేవతలు, మహర్షులు ఆందోళన చెందారు. ఈ విపత్తును నివారించడానికి, భగీరథుడు పరమశివుడిని ప్రార్థించి.. గంగా ప్రవాహాన్ని తన శిరస్సుపై ధరించమని వేడుకున్నాడు.

భగీరథుడి భక్తి.. మానవాళి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, శివుడు గంగా దేవిని తన జటాజూటంలోకి ఆహ్వానించారు. గంగ అహంకారంతో శివుడిపైకి వెళ్లినప్పుడు, శివుడు ఆమెను తన జుట్టు పోగులలో బంధించారు.

Advertisement

మానవాళికి మోక్షం:
కొంతకాలం తర్వాత.. భగీరథుడి అభ్యర్థన మేరకు, శివుడు గంగను ఏడు పాయలుగా విడదీసి, శాంతమైన ప్రవాహంగా భూమిపైకి వదిలారు. ఈ ప్రవాహమే భగీరథుడిని అనుసరించి.. సగర కుమారుల భస్మంపై ప్రవహించి, వారికి మోక్షం ప్రసాదించింది.

Also Read: మోక్ష సాధనలో అన్నం అడ్డుపడుతుందా ? ఏకాదశి నియమాలు..

గంగ స్వర్గంలో కాకుండా భూమిపై ప్రవహించడానికి ప్రధాన కారణం:

మానవ విముక్తి : సగర కుమారుల ఆత్మలతో సహా.. భూమిపై నివసించే కోట్లాది మంది పాపాలను పోగొట్టి, వారికి ముక్తిని ప్రసాదించే శక్తి గంగకు ఉంది. దేవలోకంలో గంగ కేవలం దేవతలకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ భూమిపై అది జీవులందరినీ ఉద్ధరించగలదు.

భూమి రక్షణ: గంగా ప్రవాహం తీవ్రత నుంచి భూమిని రక్షించడం. శివుడు ‘గంగాధరుడు’గా అవతరించి, భూమిని విపత్తు నుంచి కాపాడారు.

జీవనధారం: గంగానది కేవలం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతనే కాక, కోట్లాది మందికి జీవన జలాన్ని, వ్యవసాయానికి ఆధారాన్ని అందిస్తోంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×