Big Stories

vehicles : కొత్త వాహనాలకి నిమ్మకాయలే ఎందుకు కట్టాలి?

vehicles : కొత్త వాహనాలు కొన్నప్పుడు అన్ని మతాల్లో పూజలు చేసే సెంటిమెంట్, ఆచారం ఉన్నాయి. హిందుమతంలో పాత, కొత్త వాహనాలకు పూజ చేయకుండా వాడరు. ఏ వాహ‌నమైనా కొన్నా సరే శాస్త్రోక్తంగా పూజ చేయించే ప‌ద్ధ‌తి ఉంది. సెకండ్ హ్యాండ్ వాహ‌నం కొన్న‌ప్ప‌టికీ అది త‌మ చేతుల్లోకి వ‌చ్చింది మొద‌టి సారే క‌నుక అలాంటి వాహ‌నాల‌కు కూడా పూజ‌లు చేయిస్తారు. వాహ‌న‌ దారులు త‌మ ఇష్ట దైవానికి చెందిన ఆల‌యానికి వెళ్లి పూజ జ‌రిపిస్తారు. అయితే సాధార‌ణంగా ఎవ‌రైనా హ‌నుమంతుడు లేదా దుర్గాదేవి ఆల‌యాల‌కు వెళ్లి ఈ పూజ చేస్తారు.

- Advertisement -

పూజ చేయించి నిమ్మకాయలు కట్టడం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం. కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహనం నడిపే వారి పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు,మిరపకాయలు కడతారు. వాహ‌నాల‌కు ఎలాంటి గాలి సోక‌కండా, దుష్ట శ‌క్తులకు అవి నెల‌వు కాకుండా ఉండేందుకు, వాటిని త‌రిమికొట్టేందుకు గాను అలా నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌కాయ‌ల‌ను క‌డ‌తారు

- Advertisement -

ల‌క్ష్మీదేవికి తీపి వంట‌కాలు అంటే ఎంత ఇష్ట‌మో ఆమె అక్క అయిన అల‌క్ష్మికి కారం, పులుపు వంట‌కాలంటే అంత ఇష్ట‌మ‌ట‌. అందుక‌ని ఆవిడ‌ను శాంతింప‌ జేయ‌డానికి వాహ‌నాల‌కు అలా కారం ఉండే మిర‌ప‌కాయ‌లు, పులుపు ఉండే నిమ్మ‌కాయ‌ల్ని క‌డ‌తారు. దీంతో ఆవిడ శాంతించి వాహ‌నాల‌కు ఎలాంటి ప్రమాదం క‌ల‌గ‌నీయ‌ద‌ట‌.

ఇప్పుడంటే చాలా మంది వాహ‌నాల్లో వేగంగా ఎక్క‌డికంటే అక్క‌డికి ఎన్ని వంద‌ల కిలోమీట‌ర్లు ఉన్నా తక్కువ సమయంలోనే చేరుకుంటున్నారు. కానీ ఒక‌ప్పుడు ఎడ్ల బండ్లు, అవి లేక‌పోతే కాలి న‌డ‌కే దిక్కు. అయితే అలా కాలి న‌డ‌క‌న లేదా ఎడ్ల బండ్ల‌లో సుదీర్ఘ ప్ర‌యాణం చేసేవారు. అప్పుడు త‌మ వెంట నిమ్మ‌కాయ‌ల‌ు, మిర‌ప‌కాయ‌ల‌ను తీసుకెళ్లేవార‌ట‌. దీంతో నిమ్మ‌కాయ‌ల వ‌ల్ల దాహంగా అనిపించిన‌ప్పుడు ష‌ర్బ‌త్ లాంటివి చేసుకుని తాగేవారు. దీంతో శ‌క్తి వ‌స్తుంది. విష‌పు కీట‌కాలు కుట్టిన‌ప్పుడు మిర‌ప‌కాయ‌ల‌తో వైద్యం చేసేవార‌ట‌. అందుక‌ే నిమ్మ‌కాయ‌లు, మిర‌ప‌ కాయ‌ల‌ను తీసుకెళ్లే ప‌ద్ధ‌తి ఇలా మారింద‌ని కొంత చెబుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News