E-Paper
Advertisement

Nani: నేను అందుక‌నే స్టార్ డైరెక్ట‌ర్స్‌తో సినిమాలుచేయ‌టం లేదు: నాని

Nani: నేను అందుక‌నే స్టార్ డైరెక్ట‌ర్స్‌తో సినిమాలుచేయ‌టం లేదు: నాని
Advertisement

Nani:కెరీర్ ప్రారంభం నుంచి విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుని సినిమాలు చేస్తూ వ‌స్తున్న హీరో నాని. అదే ఆయ‌న‌కు వ‌రుస విజ‌యాల‌ను అందించింది. అలాగే ఆయ‌న్ని కామ‌న్ ఆడియెన్స్‌కు చాలా ద‌గ్గ‌ర చేసింది. నేచుర‌ల్ స్టార్ అని అంద‌రూ పిలుచుకునేలానూ నిల‌బెట్టాయి స‌ద‌రు సినిమాలు. అయితే నాని చేస్తే డెబ్యూ డైరెక్ట‌ర్స్‌తో సినిమాలు చేస్తున్నారు. లేక‌పోతే ఓ మోస్త‌రు విజ‌యాల‌ను సాధించిన ద‌ర్శ‌కుల‌తోనే ప‌ని చేస్తున్నారు.

అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో స్టార్ డైరెక్ట‌ర్స్‌తో నాని ప‌ని చేయాల‌నుకోవ‌టం లేదా? లేక వారే నానితో ప‌ని చేయాల‌నుకోవ‌టం లేదా? అనే ప్ర‌శ్న ఎదురైంది. దానికి నాని చాలా తెలివిగా బ‌దులిచ్చారు. ‘స్టార్ డైరెక్ట‌ర్స్ నాతో సినిమాలు చేయాల‌నుకుంటున్నారు. వారు నాకు ఫోన్ చేసి సినిమా చేద్దామ‌ని చెప్ప‌గానే నాకు హ్యపీగానే ఉంటుంది. వారు వెంట‌నే ఫ‌లానా నెల నుంచి షూటింగ్స్ కూడా చేస్తామ‌ని అంటారు. అయితే అస‌లు ముందు క‌థ చెప్పండి సార్‌.. నేను కూడా రెడీ అని అన‌గానే. వారు మ‌ళ్లీ నాకు ఫోన్ చేయ‌టం లేదు ఏం చేద్దాం. ఓ యాక్ట‌ర్‌గా మంచి క‌థ‌లున్న సినిమాలు కూడా చేయాలిగా’ అన్నారు నాని. నిజమే మరి. నేచురల్ స్టార్ చెప్పిన దాంట్లోనూ తప్పు లేదుగా. ఎంద పెద్ద డైరెక్టర్ అయినా మంచి కథ ఉంటేనే కధా, సినిమా హిట్ అవటానికి.

Advertisement

ప్రస్తుతం నాని నటించిన చిత్రం దసరా. రా అండ్ రస్టిక్ మూవీ. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కింది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌. మార్చి 30న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ద‌స‌రా రిలీజ్ కాబోతుంది. శ్రీకాంత్ ఓదెల డెబ్యూ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం నాని అండ్ టీమ్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉన్నారు.

Chiranjeevi:- డా.బ్రహ్మానందంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్

Advertisement

Animal vaccine : యానిమల్ వ్యాక్సిన్ తయారీ.. వారి సహకారంతోనే..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×