Colorado: మరణించిన తర్వాత ఎక్కడకు వెళ్తున్నాం అనేది అంతుచిక్కని రహస్యం. జననం.. మరణంలో ఏముందో తెలుసుకోవాలని వేల ఏళ్ల తరబడి ప్రయత్నాలు జరుగుతున్నా, ఎక్కడా క్లారిటీ లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు వివరించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామనేది అంతుచిక్కని రహస్యం. దీనిపై ఆథ్యాత్మిక వేత్తలు, యోగులు చేసిన.. చేస్తున్న ప్రయోగాలు అన్నీఇన్నీ కావు. కాకపోతే ఇలా జరుగుతుందనేది నేటికీ ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనికోసం యోగా చేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు.
యోగా లోతుల్లోకి వెళ్లడం అనేది ఆషామాషీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ లోకం ఉన్న అందరితో భౌతిక సంబంధాలు తెచ్చుకుని వేరే లోకానికి వెళ్లాలంటే ఏళ్ల తరబడి తపస్సు చేయాలి. అప్పుడు కొంత మాత్రమే అర్థమవుతుంది. కానీ క్లియర్‌గా చెప్పలేము. ఒకవేళ భూమి మీదకు వచ్చేసరికి అక్కడి జరిగిన సన్నివేశాలు మరిచిపోతాము.
తాజాగా అమెరికాలోని కొలరాడోకి చెందిన 33 ఏళ్ల బ్రియానా లాఫెర్టీ అంతు చిక్కని రహస్యాన్ని బయటపెట్టింది. కొన్నాళ్లుగా ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. బ్రియానాకు చేయని ట్రీట్‌మెంట్ లేదు. అయినా ఫలితం దక్కదని డాక్టర్లు తేల్చిచెప్పేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆమెకు ఎలాంటి ఉపశమనం లభించలేదు.
ALSO READ: శని, బుధ కలయికతో త్వరలో నవ వంచమ రాజయోగం
వైద్యులు చనిపోయిందని ప్రకటించిన 8 నిముషాల తర్వాత ఆమె లేచి కూర్చొంది. వైద్యశాస్త్రలో ఇదొక మిరాకిల్ అని చెప్పవచ్చు. అయితే 8 నిమిషాలు ఏమి జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది. తనకు సిద్ధంగా ఉన్నారా అనేమాట మాత్రమే వినిపించిందని తెలిపింది.
ఆ తర్వాత చీకటిగా మారిపోయిందని మనసులోని మాట బయటపెట్టింది. ఆత్మ ఎన్నటికీ చనిపోదని, మన స్పృహ సజీవంగా ఉండి అది రూపాంతరం చెందుతుందని తెలిపింది. వాస్తవికతను చూస్తాయని తాను గ్రహించినట్టు తెలిపింది. తనకు ఇదొక వరంగా చెప్పుకొచ్చిందామె.
తాను భౌతిక శరీరం నుండి విడిపోయానని తెలిపింది. తాను అలాంటి మానవ స్వభావాన్ని చూడలేదని వెల్లడించింది. నిశ్చలంగా.. సజీవంగా, అవగాహనతో అధిక ప్రశాంతమైన అనుభూతి చెందానని తెలిపింది. ఆ సమయంలో తనకు ఎలాంటి నొప్పి లేదని బయటపెట్టింది. ఆ సమయంలో భూసంబంధమైన ఉనికి అంతం కాదని భావించినట్టు తెలియజేసింది.
కొత్త లోకంలో మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివి తేటలున్నవారు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయని చెప్పుకొచ్చింది. నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు చాలా సంక్లిష్టమైనవి. చనిపోయే ముందు ఈ లోకంతో బంధాలు తెగిపోయాయి. అలాంటి బ్రియానా అక్కడ గురించి తనకు గుర్తున్న కొన్ని విషయాలు బయటపెట్టింది.
మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు చాలా సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం చాలా కష్టమైన పని. ప్రస్తుతం యుగంలో శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2022 అధ్యయనం ప్రకారం మానవ మెదడు జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను మరణ అంచున ఉన్న సమయంలో వాటిని గుర్తు చేసుకుంటుందని చెబుతున్నారు.
చాలామంది కళ్ళ ముందు జీవితం మెరుస్తున్నట్లుగా అభివర్ణిస్తారని చెబుతున్నారు. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధకులు కొన్ని విషయాలు బయటవచ్చాయి. జీవులు జీవితాంతం తమ చుట్టూ కాంతిని విడుదల చేస్తాయని తేలింది. ఆ జీవి శరీరం నుంచి వేరైనప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని పేర్కొన్నారు.