Pawan kalyan : టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు. పెద్దితో దుమ్ములేపబోతున్నారని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ‘పెద్ది’ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆర్సీ17 పై ఎవ్వరి ఊహాకు అందని టాక్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.. అదేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..
‘పెద్ది’ షూటింగ్ అప్డేట్..
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బుచ్చిబాబు రెండో సినిమానే రామ్ చరణ్ తో కావడం విశేషం అనే చెప్పాలి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరోవైపు రామ్ చరణ్ కూడా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవల విడుదలైన టీజర్ తో బుచ్చి బాబు రామ్ చరణ్ కు అత్యంత ఇష్టమైన డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు..
ఆర్సీ 17 పై అదిరిపోయే న్యూస్..
ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారనే ఆసక్తి నెలకొంది.. ఈ మూవీ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని అటు మెగా ఫాన్స్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెక్ట్స్ క్రేజీ లైనప్ ను సెట్ చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఆర్సీ17 చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది.. ఒకవైపు సుకుమార్ తో, మరోవైపు త్రివిక్రమ్ తో సినిమాతో చేస్తాడనే వార్తలు వినిపినుంచాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కన్ఫామ్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్, చరణ్ కాంబోలో మూవీ..
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబోలో మూవీ అంటే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆర్సీ17 ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని అంటున్నారు. ఇలా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాంబో సెట్ కానుందని అంటున్నారు.. మరోవైపు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.
Also Read :మేకర్స్ డైలమా.. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్..!
రామ్ చరణ్ పెద్ద సినిమాతో బిజీగా ఉన్నారు.. ఈ మూవీ పై అంచనాలు రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఈనెల 26న రాబోతుందని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. మరి త్వరలోనే దీనిపై అధికారికి ప్రకటన రాబోతుందని సమాచారం.