BigTV English

  Rooms in Tirumala: తిరుమలలో రూమ్స్ దొరకలేదా..? ఇలా చేస్తే ఈజీగా దొరుకుతాయి

  Rooms in Tirumala: తిరుమలలో రూమ్స్ దొరకలేదా..? ఇలా చేస్తే ఈజీగా దొరుకుతాయి

Rooms in Tirumala: తిరుమల వెళ్తున్నారా..? దర్శనానికి టోకెన్లు దొరికినా ఉండటానికి రూమ్స్‌ దొరకలేదా..? రూమ్ లేకుండా ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఏం పర్వాలేదు. తిరుమలలో రూమ్‌ దొరక్కపోతే ఇలా చేయండి. మీకు తప్పకుండా రూమ్‌ దొరుకుతుంది. అదెలాగే ఇప్పుడు తెలుసుకుందాం.


కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజు వేల మంది భక్తులు వెళ్తుంటారు. అయితే కొండ మీదకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఎన్నో గెస్ట్‌ హౌస్‌లు కట్టి భక్తులకు తక్కు వ ధరలలోనే రూములు అందిస్తుంది. అయితే ఎన్ని వసతులు కల్పిస్తున్నా.. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ వల్ల చాలా మందికి దర్శనం టోకెన్లు దొరికినా రూములు మాత్రం దొరకడం లేదు. ఇప్పటి వరకు తిరుమలలో మూడు రకాల వసతులు కల్పిస్తుంది టీటీడీ బోర్డు. అందులో మొదటిది ఉచితంగా వసతి కల్పించడం.

ఉచిత వసతి: ఇందుకోసం దేవస్థానం వారు పెద్ద వసతి సముదాయాలు కట్టించారు. ఇందులో లాకర్లు, స్నానపు గదులు,  కళ్యాణ కట్టలు ఉంటాయి. అన్న ప్రసాద సౌకర్యం కూడా కల్పించారు. అయితే వీటిల్లో మంచాలు, రూములు ఉండవు.. పెద్ద హాల్స్‌ ఉంటాయి. అక్కడ విశ్రాంతి తీసుకొవచ్చు. వీటిలో వసతి కోసం పీఏసీ లోని ఒకటి, రెండు, మూడు, నాలుగు కౌంటర్ల దగ్గరకు వెళ్లి ఆధార్‌ కార్డు చూపిస్తే లాకర్లు ఇస్తారు. అందులో లగేజీ భద్రపరుచుకోవచ్చు. ఈ పీఏసీ సెంటర్లు కొండ మీద సీఆర్‌వో ఆఫీసు, బస్టాండ్‌ దగ్గర ఉంటాయి.


దేవస్థానం అద్దె గదులు: టీటీడీ ఆధ్వర్యంలో కొండ మీద అద్దె గదులు భక్తులకు కేటయిస్తారు. రామ్ బగీచ, వరాహస్వామి , సప్తగిరి, సుదర్శనం గెస్ట్ హౌస్ లలో భక్తులకు వసతి కల్పిస్తారు. అందుకోసం నామమాత్రపు రుసుమ, అడ్వాన్స్‌ వసూలు చేస్తుంది టీటీడీ బోర్డు. ఈ రూములు ఆన్‌లైన్‌ లో బుక్‌ చేసుకోవచ్చు లేదంటే కొండ మీద సీఆర్వో ఆఫీసు దగ్గర ఆధార్‌ కార్డు చూపించి ఆఫ్‌ లైన్‌ లోనూ  పొందవచ్చు. ఉదయం ఆరు గంటల లోపు క్యూ లైన్‌ లో నిలబడితే రూములు దొరికే అవకాశం ఉంటుంది.

డోనేషన్‌ రూములు: డోనర్స్‌ కట్టించిన రూములను కూడా భక్తులకు కేటాయిస్తుంది టీటీడీ. అయితే ఆ డోనర్స్‌ ఉంటే మాత్రం వేరే వాళ్లకు కేటాయించరు. అలాగే వీవీఐపీ రికమండేషన్‌ లెటర్స్‌ తీసుకొచ్చిన వాళ్లకు కూడా వసతి సదుపాయం కల్పిస్తుంది టీటీడీ.

ఇవి కాకుండా టీటీడీ మరెక్కడా రూములు కేటాయించదు. అయితే వేసవి సెలవులు.. కొన్ని ప్రత్యేక పర్వదినాలలో కొండ మీదకు భక్తులు పెద్దెత్తున పోటెత్తుతుంటారు. అలాంటి సమయంలో చాలా మందికి రూములు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్లు గుడి వెనక మేదర మిట్ట ప్రాంతంలో ప్రైవేట మఠాలు ఉంటాయి. అక్కడికి వెళ్లి వాళ్లను సంప్రదిస్తే మఠాలలోని రూములను అద్దె ప్రాతిపదినక ఇస్తారు. మఠాలలో అద్దె తీసుకుంటే ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి తిరుమల వెళ్లాలనుకుంటే రూం దొరకుతుదో లేదోనన్న మీమాంస మీకొద్దు. టీటీడీ వారి వసతి సదుపాయం దొరక్కపోయినా.. బాధ పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా గుడి వెనక ఉన్న మఠాలలో రూమ్స్‌ తీసుకొండి. ఈ సమాచారం మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి.

ముఖ్య గమనిక: తిరుమల తిరుపతి దేవస్థానం వారి గెస్ట్ హౌస్ లలో ఒక్కరికి రూమ్ ఇవ్వరు. వారు తప్పనిసరిగా యాత్రికుల వసతి సదుపాయంలో ఆధార్ కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకుని లాకరు తీసుకోవాల్సి ఉంటుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

Related News

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Big Stories

×