Sreeleea: కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా. శ్రీ లీలా నటించిన పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయిన కూడా శ్రీలీలకు వరుసగా అవకాశాలు వచ్చాయి. మామూలుగా ఒక సినిమా హిట్ అయితేనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. కానీ ఒక డిజాస్టర్ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు పొందుకొని నేడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు సాధించింది.
యాక్టింగ్ కెరియర్
శ్రీలీలా రీసెంట్ టైమ్స్ లో మంచి సూపర్ హిట్స్ అందుకుంటుంది. త్రినాధరావు నక్కిన (Trinadharao Nakkina) దర్శకత్వంలో రవితేజ సరసన చేసిన ధమాకా సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ వేయడం శ్రీలీలాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఒక ప్రస్తుతం స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలానే పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా కనిపించనుంది.
Also Read : Raid 2 Movie Collections: బాలీవుడ్ కు ఊరట, రెయిడ్ 2 కలెక్షన్లు ఎంత అంటే.?
అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది
మామూలుగా డాక్టర్ కావలసిన వాడు యాక్టర్ అయ్యాడు అంటూ చెబుతూ ఉంటారు. కానీ శ్రీ లీల విషయంలో ఈ రెండు జరిగాయి. ఒకవైపు హీరోయిన్ గా బిజీగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సాధించుకోవడమే కాకుండా, మరోవైపు తన ఎంబిబిఎస్ కూడా పూర్తి చేసుకుంది. అయితే శ్రీలీలా 2022 లో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి మూడవ కిడ్ ను దత్తత తీసుకుంది. ఈ తరుణంలో శ్రీ లీలా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు చదువుకుంటూ, అలానే దత్తత తీసుకోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతానికి శ్రీలీలా భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక శ్రీలీలా డాన్స్ విషయానికి వస్తే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఎనర్జీని మ్యాచ్ చేయటం మామూలు విషయం కాదు. కొంతమంది ప్రేక్షకులు ఈవిడ డాన్స్ చూడ్డానికి కూడా థియేటర్ కు వెళ్తారు అని చెప్పాలి. రీసెంట్ గా పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది.
Also Read : Akkineni Nagarjuna : ‘పుష్ప’ మూవీపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. సౌత్ కంటే నార్త్‌లోనే అంటూ..