Dreams To Death: కలులు కనండి వాటిని సాకారం చేసుకోండి అని ఒక పెద్దాయన చెప్పారు. కానీ అన్ని కలలు మంచివి కాదని శివపురాణం చెప్తోంది. కొన్ని రకాలు కలలు వస్తే ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడని శివమహాపురాణంలో శివుడు పార్వతిదేవికి చెప్పినట్లు ఉంది. ఇంతకీ ఏంటా కలలు..? వాటి కథా కమామీషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు పీడ కలలు వస్తే మరికొన్ని సార్లు మంచి కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలో మనకు మూడు రకాల కలలు వస్తూ ఉంటాయి. అవి జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయయని చెబుతూ ఉంటారు. అయితే చాలా వరకు మనకు కలలో వచ్చిన వస్తువులు గానీ మనుక వచ్చిన కలను గానీ మర్చిపోతూ ఉంటాము. కేవలం కొన్ని రకాల కలలు మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటూ ఉంటాము.
అయితే మనకు మరణం వచ్చే ముందు కలలో పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యం అని శివపురాణం చెబుతోంది. శివపురాణం ప్రకారం పార్వతి దేవి, ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని స్వామి మరణానికి సంకేతం ఏంటి..? మరణం రాబోతుందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా అప్పుడు పరమశివుడు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు లేదా కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలలో చనిపోవచ్చని అర్థం. నీరు, నూనె అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడని అర్థం. ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడ తాము చూసుకోలేరు. ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం ఉండదు. ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే ఈ లోకాన్ని విడిచిపెడతాడని అర్థం. అలాగే వారం రోజుల పాటు ఎడమ చేయి మెలి తిరిగిపోతున్నట్టు అనిపిస్తున్నా.. కూడా త్వరలో అతనికి మరణం గ్యారంటీగా వస్తుందని అర్థం.
అదే విధంగా నోరు, నాలుక, చెవులు, కళ్లు, ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్టు అనిపిస్తే.. ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతాడట. ఇక చంద్రుడు, సూర్యుడు, అగ్ని కాంతిని చూడలేనప్పుడు ఇక ఆ వ్యక్తి జీవించేది ఆరు నెలలేనట. ఇక నాలుక అకస్మాత్తుగా ఉబ్బి, దంతాల్లో చీము వస్తే కూడా ఆ వ్యక్తి ఆయుష్షు ఆరు నెలల్లో తీరిపోతుందట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఎరుపు రంగులోనే కనిపించినా ఆ వ్యక్తికి మరణ గడియలు సమీపించినట్టే అని అర్థం. ఇక కలలో గుడ్లగూబ కనిపించినా.. ఆ వ్యక్తి త్వరలోనే మరణిస్తాడట. అలాగే ఏదైనా గ్రామాన్ని ఖాళీగా గానీ ధ్వంసం చేసినట్టు గానీ కల వస్తే ఆ వ్యక్తికి మృత్యువు సమీపించినట్టే అని స్వప్నశాస్త్రంలో ఉందట. ఇక పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్నా.. వాలినా.. కూడా అది మరణ సంకేతంగా భావించాలి.
చనిపోయే ముందు రోజు పార్వతీ పరమేశ్వరులు కలలో వచ్చి పరామర్శిస్తారట. మరణానికి ముందు రోజు యమభటులు కలలో కనిపించి పేరు అడుగుతారట. ఇక కలలో రెండు పిచ్చుకలు నీళ్లలో ముగిని తేలినట్టు కనిపించినా మీ ప్రాణం గాలిలో కలిసిపోయినట్టేనట. తీతువు పిట్ట ఇంటిపై నుంచి వెళ్లినా ఆ ఇంటి యజమాని మరణానికి చేరువలో ఉన్నాడని సంకేతమట.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు