Vijay Devarakonda: సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ మధ్య డేటింగ్ అనేది చాలా కామన్ అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ అలా డేటింగ్‌లో ఉన్న సెలబ్రిటీలు కూడా వారి రిలేషన్‌షిప్ గురించి అంత ఓపెన్‌గా చెప్పడానికి ఇష్టపడరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న జంట అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందనానే. వీరిద్దరూ కలిసి ఇప్పటికీ రెండు సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటినుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చినా వాటిపై ఓపెన్‌గా స్పందించడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. తాజాగా తను ప్రేమించిన ఒక వ్యక్తిపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక ట్వీట్ షేర్ చేశాడు విజయ్. కానీ అది రష్మిక కోసం మాత్రం కాదు..
స్పెషల్ పోస్ట్
ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్ అంత ఫామ్‌లో లేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతున్న సినిమాలు కూడా డిశాస్టర్లుగా నిలవడంతో ఈ రౌడీ హీరోకు ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. అందుకే ప్రస్తుతం తన ఆశలన్నీ ‘కింగ్‌డమ్’పైనే ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ మూవీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించాలని మూవీ టీమ్ డిసైడ్ అయ్యింది. అందుల భాగంగా ఈ మూవీ నుండి ‘హృదయం లోపల’ అనే ఒక మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆ పాటకు ఫిదా అయిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు.
అదే కోరిక
‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్రత్యేకంగా విడుదల చేయగా దానికి మ్యూజిక్ లవర్స్ ఫిదా అయ్యారు. ఇక విజయ్ దేవరకొండ కూడా అనిరుధ్ టాలెంట్‌కు ఫిదా అయ్యి తనకు ప్రత్యేకంగా ఒక లేఖ రాశాడు. ‘‘ఒక ప్రేమ పాటను విడుదల చేసిన సందర్భంగా నా అనికు ఒక చిరు ప్రేమలేఖను రాస్తున్నాను. వీఐపీ, 3 సినిమాల సమయం నుండి నేను అనిరుధ్‌కు పెద్ద ఫ్యాన్. అప్పట్లోనే అసలు ఎవరు ఈ జీనియస్ అనుకునేవాడిని. నేను ఎప్పటికైనా యాక్టర్ అయితే నేను స్క్రీన్‌పై కనిపించినప్పుడు తన మ్యూజిక్ వినిపించాలి అని కోరుకునేవాడిని’’ అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).
Also Read: విజయ్ దేవరకొండపై కేసు.. అరెస్ట్ తప్పదా?
పదేళ్ల తర్వాత
‘‘అలా అనుకొని పదేళ్ల గడిచిపోయాయి. నా 13వ సినిమా ఇంకొక 28 రోజుల్లో విడుదల కానుంది. ఇది విజయ్ దేవరకొండ, అనిరుధ్‌లు కలిసి చేసిన మొదటి పాట. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఒక యాక్టర్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నుండి మా ప్రపంచాన్ని, మా ఎమోషన్స్‌ను మీకోసం ఓపెన్ చేస్తున్నాను. ఇది మీ ప్రపంచంలో సంతోషాన్ని, జ్ఞాపకాలను నింపుతుందని ఆశిస్తున్నాం. ప్రేమతో మీ విజయ్’ అని ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. మొత్తానికి ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ‘హృదయం లోపల’ అంటూ సాగే ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
Hey @anirudhofficial ☺️#HridayamLopala from #Kingdom – Today 4.06 PM onwards ❤️@gowtam19 @vamsi84 pic.twitter.com/NoIt6IiXea
— Vijay Deverakonda (@TheDeverakonda) May 2, 2025