BigTV English

Sign of Fate: ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ దశ తిరిగిపోతుందట

Sign of Fate: ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ దశ తిరిగిపోతుందట

Sign of Fate: పెళ్లి విషయంలో కలల ప్రపంచంలో విహరించే అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిల్లో అందాన్ని మాత్రమే చూస్తున్నారు. అమ్మాయి బ్యూటిఫుల్‌గా కనిపిస్తే చాలు ముందూ వెనక ఆలోచించకుండా ఆ అమ్మాయి వెనక పరుగులు పెడుతున్నారు. అమ్మాయి అందానికి ఇచ్చిన ఇంపార్టెంట్‌ ఆ అమ్మాయి మనసుకు కానీ మంచితనానికి కానీ ఇవ్వడం లేదు. కానీ హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమ్మాయి అందం కన్నా మంచి గుణమే ముఖ్యం అని చెప్తున్నారు పండితులు.


అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి జీవితం మారిపోతుందో శాస్త్రం చెప్తుందంటున్నారు.  శాస్త్రం ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిల జీవితాలు మారిపోతాయని.. వారికి దశ తిరుగుతుందంటున్నారు. అప్పటి వరకు ఒక లెక్క ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక లెక్క అన్నట్టుగా వారి జీవితం అభివృద్ది పథంలో దూసుకుపోతుందట. అంతటి అదృష్ట వంతురాలైన కోడలు ఇంటికి వస్తే.. ఆ ఇల్లే సర్గంలా మారిపోతుందట. ఒక్క అబ్బాయే కాదు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారట.  ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈరోజులో చాలా మంది అబ్బాయిలు అందంగా ఉన్న అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి చూపుల్లో అమ్మాయికి అది బాగాలేదు. ఇది బాగాలేదు అంటూ వంక పెడుతుంటారు. కానీ అమ్మాయిల్లో అందం కన్నా గుణం చూడాలని చెప్తుంటారు మన పెద్దవాళ్లు.


శాస్త్రం ప్రకారం అమ్మాయిల నుదురు (four head) వెడల్పుగా ఉండాటల. అలాగే అమ్మాయి కళ్లు పౌర్ణమి చంద్రుడిలా నిండుగా కళకళలాడుతూ ఉండాలట.  ముక్కు కింద పెదవుల దగ్గర పుట్టు మచ్చ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే అదృష్టం జెట్‌ స్పీడుతో మీ జీవితంలోకి వస్తుందట.

అలాగే అమ్మాయిలకు జుట్టు పొడువుగా నడుము కింద వరకు ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఎంతో లక్కీ అంట. అమ్మాయిలకు ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఆ అమ్మాయిని చేసుకున్న అబ్బాయికి బాగా కలిసి వస్తుందట.

ఇక అమ్మాయిల అరికాళ్లలో ప్రత్యేకమైన గుర్తులు అంటే కమలం, శంఖం, చక్రం, నక్షత్రం లాంటివి ఉంటే వాళ్లు ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో కనకవర్షం కురుస్తుందట.

అమ్మాయి చేతులు పొడువుగా ఉండాలట. అలాగే వారి చేతి గోర్లు మిలా మిలా తెల్లగా మెరుస్తూ ఉండాలట. అటువంటి అమ్మాయిల చేయి పట్టుకున్న అబ్బాయికి అంతా మంచే జరుగుతుందట.

ఇక కాలికి ఉన్న వేళ్లు అన్ని సమంగా ఏ అమ్మాయికి అయితే ఉంటాయో అటువంటి అమ్మాయిలు అడుగుపెట్టే ఇంట్లో సంపదలు వెల్లివిరిస్తాయని శాస్త్రం చెప్తుందట. ఇలాంటి అమ్మాయిలను నడిచొస్తున్న లక్ష్మీదేవితో పొల్చవచ్చు అంటున్నారు.

అమ్మాయి పళ్లు తెల్లగా శంఖంలాగా ఉండాలట.  ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అబ్బాయిల జీవితాలు ఏ కష్టం లేకుండా తాపీగా సాగిపోతుంటాయట. అలాగే అమ్మాయిల పళ్ల వరుస కూడా ఎగుడుదిగుడు లేకుండా స్ట్రైట్ గా ఉండాలట. ఇక అమ్మాయిల పై పళ్ల వరసలో ముందు ఉన్న పళ్ల మధ్య చిన్నగా గాప్‌ ఉండాలట. ఇలాంటి అమ్మాయిలను చేసుకున్న అబ్బాయిలు కోట్ల రూపాయలను సంపాదిస్తారట.

ఇక ఏ అమ్మాయికైతే ముక్కు మీద మధ్య భాగంలో తిలకం లాంటి పుట్టుమచ్చ ఉంటుందో ఆ అమ్మాయి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కానీ ఆ అమ్మాయిని చేసుకున్న అబ్బాయికి మాత్రం బాగా కలిసొస్తుందట.

ముఖ్య గమనిక:  పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్‌ టీవీ సొంతంగా క్రియేట్‌ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×