BigTV English

AP DSC 2025: డీఎస్సీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి

AP DSC 2025: డీఎస్సీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఖాళీల భర్తీకి సంబంధించిన AP DSC 2025 పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరగనున్నాయి. స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ప్రిన్సిపాల్ తదితర పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుండో అభ్యర్థులు వేచిఉన్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో కూటమి అధికారంలోకి రావడం, తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పై చేయడంతో అభ్యర్థుల ఆశలు చిగురించాయి. దానికి తగినట్లుగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలో అభ్యర్థులు తమ ప్రతిభను పరీక్షించుకొనే సమయం ఆసన్నమైంది.


దరఖాస్తులు ఎన్ని? హాల్ టికెట్ డౌన్లోడ్ సమయంలో ఇలా చేయండి
ఈ పరీక్షలకు ఇప్పటికే 5.6 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల ఎంపిక, అడ్మిట్ కార్డ్ లింక్, అభ్యర్థుల సమాచారం తదితర ప్రక్రియలన్నీ పూర్తి కాగా, హాల్‌టికెట్‌ లింక్ అధికారికంగా https://apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో విడుదలైంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సమయంలో అభ్యర్థులు కొన్ని చిన్న తప్పులు చేస్తూ చివరి సమయంలో మిస్ అవుతుంటారు. మీరు అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి.

చివరి నిమిషానికి వేచి చూడొద్దు
వెబ్‌సైట్ లాగిన్ లేనంత వరకూ హాల్‌టికెట్ తీసుకోకుండా ఉండటం మంచిదే కాదంటున్నారు నిపుణులు. చివరి రోజుల్లో వెబ్‌సైట్ ట్రాఫిక్ పెరిగి సర్వర్ డౌన్ అవుతుంది. అందువల్ల ముందే డౌన్‌లోడ్ చేయడం మంచిది.


వివరాలు సరిగ్గా టైప్ చేయాలి
హాల్‌టికెట్ కోసం లాగిన్ అవేటప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ తప్పుగా నమోదు చేస్తే ఎర్రర్ వస్తుంది. మీ అప్లికేషన్ కాపీతో క్రాస్ చెక్ చేసి వివరాలు ఇవ్వాలి.

సైబర్ కేఫ్‌లపై ఆధారపడకండి
ఇంటర్నెట్ సెంటర్లలో మీ వ్యక్తిగత డేటా గోప్యతలో ఉండకపోవచ్చు. సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుంచి మాత్రమే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేయాలి.

హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత చెక్ చేయాలి
పేరు, ఫోటో, జెండర్, పరీక్షా కేంద్రం, సబ్జెక్టు కోడ్ వంటివన్నీ సరిగ్గా ఉన్నాయా అనే విషయాన్ని గమనించాలి. ఏవైనా తప్పులుంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి.

కలర్ ప్రింట్ కూడా తీసుకోండి
పరీక్షా కేంద్రంలో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కారణంగా ఫోటో గుర్తు పట్టకపోతే అనుమతించకపోవచ్చు. అందుకే హాల్‌టికెట్‌ను కలర్ ప్రింట్ లో కూడా తీసుకోవాలి. అప్పుడు ఏది అవసరమైతే అది వాడవచ్చు.

Also Read: Vizag Beach: తుఫాన్ టైంలో సముద్రం వెనక్కు..? విశాఖ బీచ్‌లో ప్రకృతి ఓ వింత నాటకం!

మడతపెట్టకండి
మడతలు, మచ్చలు, చించిన హాల్‌టికెట్లు స్కానింగ్‌లో సమస్యలు కలిగిస్తాయి. అందువల్ల నీట్ గా ఉంచి ఒక ఫైల్‌లో తీసుకెళ్లాలి.

ఐడి ప్రూఫ్ మర్చిపోకండి
పరీక్షా సమయంలో హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి గుర్తింపు పత్రం తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మీ హాల్‌టికెట్‌ను మెయిల్ గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేయండి. అనుకోకుండా ఫోన్ డిలీట్ అయినా, ప్రింట్ మిస్ అయినా మీ దగ్గర డిజిటల్ కాపీ ఉండాలి. క్లౌడ్‌లో సేవ్ చేయడం మంచిది.

ఫేక్ లింక్‌లకు దూరంగా ఉండండి
గూగుల్‌లో అనధికార లింక్‌లు కనిపించవచ్చు. తప్పక https://apdsc.apcfss.in వెబ్‌సైట్ నుంచే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేయండి. డీఎస్సీ అనేది మీ కెరీర్‌ను మలుపు తిప్పే పరీక్ష. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సమయంలో చేసే చిన్న పొరపాటే కొన్ని వేల మంది పోటీదారుల్లో మీ ప్రయాణాన్ని నిలిపివేస్తుంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.. మీ ప్రతిభకు ఇంకా పదునుపెట్టి విజయాన్ని అందుకోండి.

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×