BigTV English

Manchu Manoj: జీవితాంతం మీకు రుణపడి ఉంటా… కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్!

Manchu Manoj: జీవితాంతం మీకు రుణపడి ఉంటా… కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్!

Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భైరవం(Bhairavam). ఎన్నో అంచనాల నడుమ నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కనకమెడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు మనోజ్ తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నటించారు. అయితే ఈ ముగ్గురు హీరోలు గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే కాకుండా ఎలాంటి సక్సెస్ లేక ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారు. ఈ సినిమా ద్వారా ఈ ముగ్గురు హీరోలు ఒకేసారి స్క్రీన్ పై కనిపించి సందడి చేశారు. నేడు విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.


డైరెక్టర్ కు రుణపడి ఉంటా…

ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ముందుగా భైరవం సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అని తెలియజేశారు. ముఖ్యంగా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మీ రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. దాదాపు 9 సంవత్సరాలు తర్వాత తాను వెండితెరపై కనిపించానని మనోజ్ తెలిపారు. ఇన్ని
సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నన్ను అంతే ప్రేమతో ఆదరించారని ఈయన ఎమోషనల్ అయ్యారు.


సక్సెస్ సెలబ్రేషన్స్…

ఇలా మా భైరవం సినిమాను మంచి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సంతోషంలో తాను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు సక్సెస్ మీట్ కార్యక్రమంలో మరిన్ని విషయాలను మీతో పంచుకుంటానని అయితే రేపటి నుంచి మేము ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీ ఊర్లకు వస్తామని , ముగ్గురం ఒక్కొక్కరు ఒక్కవైపు వెళ్లి సినిమాని మరింత ప్రేక్షకులలోకి తీసుకువెళ్తామని మనోజ్ తెలిపారు. మొత్తానికి భైరవం సినిమా ద్వారా మనోజ్ చాలా సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు.

మనోజ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈయన తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇక భైరవం సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం గరుడన్ సినిమాకు రీమేక్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు భాషలోకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చిత్ర బృందం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక మంచు మనోజ్ తో పాటు నారా రోహిత్, సాయి శ్రీనివాస్ కూడా ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×