Big Stories

Nomination Process Ends in AP: నామినేషన్ ముగిసింది.. ఆట మొదలైంది

- Advertisement -

వీఐపీల జోరు. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది . రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా .జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మే 13న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడిస్తారు.

- Advertisement -

రాజకీయ దిగ్గజాల కుటుంబాలకు చెందిన పలువురు, ఇతర ప్రముఖులు ఈ సారి పోటీ పడుతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్‌ పులివెందుల నుంచి బరిలో ఉన్నారు. ప్రస్తుతం పులివెందుల నుంచి హ్యాట్రిక్ విజయం సాధించడానికి రెడీ అయ్యారు. జగన్‌ సోదరి అయిన పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్‌ షర్మిలారెడ్డి ఈ సారి కడప ఎంపీగా పోటీకి దిగారు. అన్న జగన్‌తో విబేధించి రాజకీయ ప్రత్యర్ధిగా మారిన షర్మిల. వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యమంటున్నారు. సోదరుడు అయిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపైనే ఆమె పోటీ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది.

Also Read: జనసైనికుడు వెన్నుపోటు.. కొండ్రుకు కష్టమేనా?

కుప్పం నియోజకవర్గాన్ని తన ఇలాకాగా మార్చుకున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. ఏడు సార్లు అక్కడి నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన. ఎనిమిదో సారి పోటీకి దిగారు. చంద్రబాబు కుమారుడైన నారా లోకేశ్‌ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి రెండో సారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా వారసుడు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయన ఈసారి నియోజకవర్గం మారతారని ప్రచారం జరిగినా పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు తిరిగి మంగళగిరి నుంచే బరిలో నిలిచారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి బాలయ్య 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయం సాధించారు. జనసేనాని పవన్‌కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటే జనసేన పీఏసీ ఛైర్మన్‌, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి పోటీలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ తరపున తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి గతంలో బాపట్ల, విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఈ సారి ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ కేండెట్‌గా లక్ పరీక్షించుకుంటున్నారు. ఆమె గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Also Read: ఇంత దిగజారుడు రాజకీయాలా..? అంత అవసరమేముంది? : షర్మిల

ఈ వారసుల సంగతి అలా ఉంటే నెల్లూరు ఎంపీ స్థానంలో పోటీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైసీపీలో ఇమడలేక బయటకొచ్చిన బిగ్‌షాట్ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీ అభ్యర్ధిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఆయన్ని ఢీకొనడానికి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నెల్లూరు బరిలో దించింది. ఆ ఇద్దరు బడాబాబులూ నెల్లూరు జిల్లాలో తమ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే ఎంపీగా గెలుస్తానన్న ధీమాతో ఉన్న విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేయకపోవడం విమర్శలపాలవుతుంది.

ఇక మరో బిగ్ షాట్ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు.. ఆయన నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో. టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు. టీడీపీలో కార్పొరేట్ లీడర్లుగా ఫోకస్ అయిన సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు రాజ్యసభ్యులుగా బీజేపీలో చేరారు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా బీజేపీ నుంచి సుజనా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా కాషాయ కండువాతో బరిలోకి దిగారు.

అలాగే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం రాజంపేట లోక్‌సభ సెగ్మెంట్. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా రాజంపేటలో పోటీకి దిగారు.. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News