Big Stories

Discount for Voters : ఓటు వేశారా ? అయితే ఈ డిస్కౌంట్లు మీ కోసమే..

20 percent Discount in Restaurents : 13 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో రెండో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారా ? అయితే.. మీ చేతి వేలిపై ఉన్న ఇంక్ ను చూపిస్తే.. తిన్నంత, తాగినంత, తిరిగినంత.. అంతా డిస్కౌంట్ మీదే. అదెలా అని ఆలోచిస్తున్నారా ? నేషనల్ రెస్టారెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓటర్లకు ఈరోజు డిస్కౌండ్ ఇస్తోంది. గరిష్టంగా ఎంత ఓటింగ్ నమోదైందో తెలుసుకునేందుకు ఈ పనికి పూనుకుంది.

- Advertisement -

కానీ.. గౌతమ్ బుద్ధనగర్, బెంగళూరులో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే గ్రేటర్ నోయిడా. నోయిడా రెస్టారెంట్ల యజమానులు సైతం ఓటర్లకు ఆఫర్లిస్తున్నారు. ఈ ఆఫర్లకు డెమెక్రటిక్ ఆఫర్ అని పేరు కూడా పెట్టారు. ఓటు వేసిన వారు.. తమ చేతివేలిపై ఇంక్ ను చూపిస్తే.. ఆహారం, మందుపై 20 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

- Advertisement -

Also Read : థైరాయిడ్ ఉందా.. అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి

తొలిదశ ఎన్నికల్లో ఓటింగ్ పెద్దగా నమోదు కాకపోవడంతో.. రెండోదశ పోలింగ్ లో ఓటింగ్ శాతం పెరగాలని రెస్టారెంట్ యజమానులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ రెస్టారెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వరుణ్ ఖేడా తెలిపారు. డిస్కౌంట్ కోసమైనా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారన్న ఆలోచనతోనే ఈ డిస్కౌంట్ పెట్టినట్లు తెలిపారు.

కాగా.. బెంగళూరులో ఉన్న డెక్ ఆఫ్ బ్రూస్, రెస్టో పబ్ లను సందర్శించే ఓటర్లకు 27,28 తేదీల్లో ఫ్రీ బీర్ తో పాటు మరిన్ని డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే వికలాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్ల కోసం రాపిడో ఆటో క్యాబ్స్, బైక్ రైడ్స్ పై డిస్కౌంట్స్ ఇచ్చింది. అంతేకాదు నోయిడాలోని ఫెలిక్స్ హాస్పిటల్ ఓటు వేసిన వారికి రూ.6500 విలువైన హెల్త్ చెకప్ ను ఫ్రీ గా అందిస్తోంది. ఓట్ ఫర్ హెల్తీ ఇండియా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ 26 నుంచి 30 వరకూ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News