BigTV English

TDP Kondru Murali Mohan vs Janasena Enni Raju: జనసైనికుడు వెన్నుపోటు.. కొండ్రుకు కష్టమేనా?

TDP Kondru Murali Mohan vs Janasena Enni Raju: జనసైనికుడు వెన్నుపోటు.. కొండ్రుకు కష్టమేనా?

TDP Kondru Murali vs Janasena Enni Raju(AP elections news): విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో పొత్తుల లెక్కలు తప్పాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగుల్ని వైసీపీ మార్చి రాజకీయాలకు కొత్త అయిన తలే రాజేష్‌కు వైసీపీ టికెట్ కేటాయించింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు వుణుకూరుగా ఆన్న ఆ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2009లో కొత్తగా ఏర్పడిన రాజంలో ఎస్సీలకు రిజర్వ్ అయింది. ప్రస్తుతం అక్కడ టీడీపీ అభ్యర్ధిగా కొండ్రు మురళీ మోహన్ పోటీలో ఉన్నారు. ప్రత్యర్ధి ఎన్నికలకు కొత్త అవ్వడంతో గెలుపుపై ధీమాతో ఉన్న మురళీకి జనసేన రెబల్ షాక్ ఇచ్చారు. జనసేన నేత ఎన్ని రాజు నామినేషన్ దాఖలు చేసి పోటీకి సిద్దమయ్యారు.


విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమికి జనసేన రెబల్ ఎన్ని రాజు షాక్ ఇచ్చారు. 2009 ఎన్నికలకి ముందు రాజాం వుణుకూరు నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో షెడ్యూల్ కుల రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా రాజాం ఏర్పాటైంది. అప్పటి వరకు వుణుకూరు సెగ్మెంట్ టీడీపీ కంచుకోటగా ఉంటూ వచ్చింది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 వరకు కిమిడి కళావెకంట్రావు అక్కడ అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో అది రాజంగా మారి ఎస్సీలకు రిజర్వ్ అవ్వడంతో కళా వెంకట్రావు ఆ సెగ్మెంట్ వీడాల్సి వచ్చింది.

Also Read: రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?


దాదాపు 50 శాతం జనాభా ఉన్న రాజాం సెగ్మెంట్‌‌లో ఎస్సీ జనాభా 15 శాతం ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. అయినా అది ఎస్సీలకే రిజర్వ్ అయింది. ఆ సెగ్మెంట్ మొదటి ఎమ్మెల్యేగా 2009లో కాంగ్రెస్ నుంచి కొండ్రు మురళీమోహన్ గెలిచి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తిరిగి కాంగ్రెస్ నుంచే గెలిచి మూడో స్థానానికి పరిమితమైన ఆయన 2019 నాటికి టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు.

వైసీపీ రెండు సార్లు గెలిచిన కంబాల జోగులును ఈ సారి పాయకరావుపేటకు షిఫ్ట్ చేసిన వైసీపీ డాక్టర్ తాలే రాజేష్ అనే కొత్త కేండెట్‌ను రాజాం బరిలో దింపింది. ఇటు పొత్తుల్లో భాగంగా రాజాం టీడీపీకే దక్కడంతో కొండ్రూ మురళీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యర్ధి ఎన్నికలకు కొత్త అవ్వడంతో సీనియర్ నేత అయిన కొండ్రు విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు.

అయితే ఇప్పుడు కొండ్రూ మురళీకి ఊహించని షాక్ తగిలింది. రాజాం జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ ఎన్ని రాజు చివరి రోజున నామినేషన్ దాఖలు చేశారు. భారీ బైక్ ర్యాలీతో వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కూటమిలో భాగంగా టీడీపీకి రాజాం నియోజకవర్గం సీటు కేటాయించినప్పటికీ తమ జనసేన కార్యకర్తల అభిమతం మేరకు రెబెల్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని భారీ ఎత్తున జనసైనికులతో రాజు నిర్వహించిన ర్యాలీ టీడీపీ శ్రేణులకు మింగుడుపడకుండా తయారైందంట  గ్యారెంటీ సీటు అనుకుంటున్న టైంలో ఇదేం తలనొప్పిరా అని తలలు పట్టుకుంటున్నారు కోండ్రూ మురళీ వర్గీయులు. మరి జనసేనాని రాజాం ఈక్వేషన్లని ఎలా సరి చేస్తారో చూడాలి.

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×