Friday OTT Movies: ప్రతి వారం థియేటర్లలోకి లెక్కలేనన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. జనాలు ఇంకా సంక్రాంతి మూవీలకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చివరగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి బ్రాహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటుగా ఓటీటీలో కూడా లెక్క లేనన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో సక్సెస్ అవ్వని మూవీ కూడా ఓటీటీలో సక్సెస్ టాక్ అందుకుంటుంది. అందుకే ఓటీటీ సంస్థలు కూడా కొత్త కంటెంట్ సినిమాలను సినీ ప్రియులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. థియేటర్లలోకి రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ శుక్రవారం ఓటీటీలో సినీ ప్రియులను అలరించేందుకు బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 17 శుక్రవారం ఏకంగా ఓటీటీలోకి 17 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్, ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్స్, కామెడీ ఇలా అన్ని రకాల జోనర్స్‌లో సినిమాలు ఉన్నాయి.. ఆ సినిమా ఎక్కడా? ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూడాలి..
అమెజాన్ ప్రైమ్..
పాతాల్ లోక్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 17
హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్ యాక్షన్ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- జనవరి 17
హెల్‌బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ (హెల్‌బాయ్ 4) (హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 17
ఐ వాంట్ టు టాక్ (హిందీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జనవరి 17
విడుతలై పార్ట్ 2 (తమిళ యాక్షన్ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- జనవరి 17
పవర్ ఆఫ్ పాంచ్ (హిందీ ఫాంటసీ సూపర్ నేచురల్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 17
ఐయామ్ కథలన్ (మలయాళ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జనవరి 17
నెట్‌ఫ్లిక్స్..
ది రోషన్స్ (హృతిక్ రోషన్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ హిందీ సిరీస్)- జనవరి 17
బ్యాక్ ఇన్ యాక్షన్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్)- జనవరి 17
ఆహా..
అన్‌స్టాపబుల్ సీజన్ 4 రామ్ చరణ్ ఎపిసోడ్ (తెలుగు టాక్ షో)- జనవరి 17
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 17
సినీ లవర్స్ కు ఈ రోజు పండగే అని చెప్పాలి.. సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా ఇవాళ 11 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో రామ్ చరణ్, బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఈరోజు స్ట్రీమింగ్ అవుతుంది.. మొత్తానికి ఐదు సినిమాలు వెరీ స్పెషల్.. అస్సలు మిస్ అవ్వకండి.. ఇక అందరి చూపు సమ్మర్ సినిమాల పైనే ఉంది..