Big TV Kissik Talks: ప్రముఖ సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వర్ష (Varsha ) ‘జబర్దస్త్’ లోకి వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయేల్ (Emmanuel )తో కలిసి పలు స్కిట్స్ చేస్తూ ఆన్ స్క్రీన్ జంటగా పేరు సొంతం చేసుకున్నారు. అలా జబర్దస్త్ లో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న వర్ష తాజాగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా నిర్వహిస్తున్న’కిస్సిక్ టాక్స్’ అనే కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురు సీరియల్, సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఈమె.. తాజాగా లెజెండ్రీ హాస్యనటులు, రాజకీయ నేత బాబు మోహన్ (Babu Mohan) ను ఇంటర్వ్యూ చేశారు. సరదా సరదా ప్రశ్నలతో షోని మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఇక అందులో భాగంగానే బాబు మోహన్ తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. అందులో భాగంగానే బాబు మోహన్ తన భార్యకు 150 కేజీల బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు అంటూ వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించడం జరిగింది. మరి ఆయన ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం
నటుడు గానే కాదు రాజకీయ నేత కూడా..
1990 లో వచ్చిన ‘ఉద్యమం’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బాబు మోహన్.. ఆ తర్వాత ‘చిరునవ్వుల వరమిస్తావా’,’ ముగ్గురు మొనగాళ్లు’, ‘చిట్టెమ్మ మొగుడు’, ‘సాహస వీరుడు సాగర కన్య’ ఇలా పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మరో నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao)తో కలిసి చేసిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ (NTR) మీద అభిమానంతో 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గము నుంచి పోటీ చేసి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయి.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బిజెపిలో చేరిన ఈయన.. 2023లో బిజెపికి రాజీనామా చేసి, 2024 అక్టోబర్ 29న మళ్లీ టీడీపీలోకి చేరారు.
భార్యకు 150 కేజీల బంగారం.. క్లారిటీ ఇదే..
ఇకపోతే వృత్తిపరమైన జీవితంలో ఎన్నో చవిచూసిన ఈయన వ్యక్తిగతంగా తన పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 13న ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయంతో ఇప్పటికీ బాబు మోహన్ కోలుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈయన ప్రాణ స్నేహితుడు, ప్రముఖ నటుడు అయినా కోట శ్రీనివాసరావు పెద్ద కొడుకు కూడా ఇలాగే చనిపోవడం బాధాకరమని చెప్పవచ్చు. ఇకపోతే బాబు మోహన్ తాజాగా కిస్సిక్ టాక్ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మీరు.. మీ భార్యకు 150 కేజీల బంగారం కొనిచ్చారంట కదా.. అని ప్రశ్నించగా దానికి బాబు మోహన్ మాట్లాడుతూ.. “అదంతా అబద్ధం. అసలు నేను ఆమె కంటూ ఏమీ ఇవ్వలేదు..” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మరొకవైపు ఈ జనరేషన్ లో వాళ్లు ఎందుకు ఎక్కువగా కుటుంబ సభ్యులతో గొడవపడి వేరుపడుతున్నారు అని ప్రశ్నించగా.. సంబంధంలేని మాటలతో నాకు అవసరం లేదు.. అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు బాబు మోహన్. మొత్తానికైతే ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.