Mollywood: ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు అర్ధాంతరంగా తనువు చాలిస్తూ.. సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచేస్తున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తుంటే.. మరికొంతమంది వయస్సు రీత్యా స్వర్గస్తులు అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మలయాళ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రసాద్(Vishnu Prasad) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన కేరళలోని ఎర్నాకులం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అటు చికిత్సకు భారీగానే ఖర్చయింది. దీంతో ఆయన ఫ్యామిలీ కూడా ఫండ్ రైజింగ్ చేపట్టింది. అయితే అంతలోనే ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి సినీ అభిమానులు, సినీ సెలబ్రిటీలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక గొప్ప నటుడుని సినిమా ఇండస్ట్రీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక విష్ణుప్రసాద్ విషయానికి వస్తే.. తమిళ సినిమా ‘కాశి’ తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన, ఆ తర్వాత రన్ వే, లయన్, కాయ్ ఎతుమ్ దూర్త్, లోకనాథన్ ఐఏఎస్ వంటి చిత్రాలలో నటించారు.
తండ్రి కోసం కూతురు త్యాగం..
విష్ణు ప్రసాద్ బుల్లితెర, వెండితెరపై కూడా అలరించారు. ముఖ్యంగా ఈయన గత కొన్ని నెలల క్రితం అస్వస్థతకు లోనవ్వడంతో వైద్యులను సంప్రదించగా.. వారు కాలేయ సమస్య ఉన్నట్లు స్పష్టం చేశారట. దీంతో కొచ్చిలోని ఒక హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకోవడం మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన కూతురు.. తండ్రికి కాలేయ దానం ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్ కి రూ.30 లక్షల మేరా ఖర్చవుతుందని, సాయం చేసి ఆదుకోమని, అతడి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించారు. ఆ డబ్బు సేకరించే లోపే ఇలా విష్ణు ప్రసాద్ కన్నుమూయడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఏది ఏమైనా ఒక గొప్ప నటుడిని ఇప్పుడు ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పవచ్చు.
విష్ణు ప్రసాద్ సినిమా జీవితం..
విష్ణు ప్రసాద్ సినిమా జీవితం విషయానికి వస్తే.. కాశీ, మరాఠా నాడు , పటాకా, లోకనాథన్ ఐఏఎస్, మంగోకాళం, కై ఎతుమ్ దూరత్ తోపాటు పలు మలయాళం చిత్రాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈయన సినిమాలతోనే కాదు సీరియల్స్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు. ఈయనకు అభిరామి, అనానిక అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ అమ్మాయిల్లోనే ఒకరు తన తండ్రికి తమ కిడ్నీని ఇవ్వాలని ముందుకు రాగా.. ఇప్పుడు ఆ డబ్బు సేకరించడంలో ఆలస్యం అయ్యింది. ఆ కారణంగానే ఆయనకి వ్యాధి తీవ్రతరం కావడంతో తుదిశ్వాస విడిచారు.