BigTV English

Prudhvi Raj on CM Jagan: జగన్ లాంటి వాడు వీధికి ఒకడుంటాడు.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు!

Prudhvi Raj on CM Jagan: జగన్ లాంటి వాడు వీధికి ఒకడుంటాడు.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు!

Prudhvi Raj Sensational Comments on CM Ys Jagan: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యి అదే డైలాగ్ ను ఇంటిపేరుగా మార్చుకున్నాడు. 30 ఏళ్లు పడిపోయింది ఇక్కడ అంటూ తనదైన రీతిలో సెటైర్స్ వేస్తూ ఉంటాడు. ఇక పృథ్వీరాజ్ ఒకప్పుడు వైసీపీలో చేరి.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశాడు. ఇక ఇప్పుడు పవన్ పార్టీలో చేరి వైసీపీ పై విమర్శలు చేస్తున్నాడు. వైసీపీ లో జగన్ పాలన నచ్చకే.. తాను పార్టీ మారినట్లు చెప్పుకొచ్చాడు. తాజాగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందాలని పిఠాపురం పాదగయా పుణ్యక్షేత్రంలో పృథ్వీరాజ్ పూజలు నిర్వహించాడు.


అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ” అమ్మవారికి పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మొన్న వెబ్ సిరీస్ షూటింగ్ కోసం వేరే రాష్ట్రము వెళ్ళినప్పుడు.. వారు ఈ పుణ్యక్షేత్రం గురించి చెప్పడం, ఇక్కడకు ఎంతోమంది భక్తులు రావడం సంతోషంగా ఉంది. వారణాసి, ఉజ్జయిని లా పాదగయా పుణ్యక్షేత్రం కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్ర మొత్తం తిరిగివచ్చాం. ఇక ఇప్పుడు ఇదంతా ప్రచారం చేస్తాం” అని చెప్పుకొచ్చాడు.


Also Read: Pawan Nomination : పవన్ నామినేషన్ కు డేట్ ఫిక్స్.. కుప్పంలో నామినేషన్ వేసిన భువనేశ్వరి

అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో YCP పార్టీలో పనిచేశినప్పటికి ప్రతిఫలం లేకపోయిందని, అలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేమని చెప్పుకొచ్చాడు. అహంకారంతో ఉండకూడదు.. పదువులు శాశ్వతం కాదు. కష్టపడి పనిచేసినా ప్రతిఫలం దక్కలేదు. ఇలాంటి దుర్మామైన పాలనలో నేను ఉండకూడదు అనుకున్నాను. కరోనా సమయంలో అత్యంత విషమ పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నాగబాబు నాకు బెడ్ ఇప్పించారు. వారే నాకు పునర్జన్మను ఇచ్చారు. వైసీపీ పాలన నచ్చక జనసేనలోకి వచ్చాను. జగన్ మోహన్ రెడ్డి లాంటోడు స్ట్రీట్ కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటోడు స్టేట్ కి ఒకడు ఉంటాడు” అంతో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×