Big Stories

Arvind Kejriwal Plans for Bail: బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్.. బయటపెట్టిన ఈడీ!

Arvind Kejriwal Eating More Sugar Food to get Bail: మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ అధికారులు తెలిపారు. షుగర్ లెవెల్స్‌ను పెంచుకునేందుకు ఆయన జైలులో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఈడీ విమర్శించింది.

- Advertisement -

ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ పలు ఆరోపణలు చేసింది. టీలో ఎక్కువ పంచదారను తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ ను పెంచుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారని ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హోస్సేన్ కోర్టులో ఆరోపించారు.

- Advertisement -

కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని వాటి కారణంగా అతని షుగర్ లెవల్స్ లో వ్యత్యాసం ఏర్పాడేలా చేసుకుంటున్నారని ఈడీ విమర్శించింది. దీంతో అతని షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

Also Read: First Phase Loksabha Elections : ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్.. ఓటేసిన హీరోలు, రాజకీయనేతలు

Arvind Kejriwal
Arvind Kejriwal

ఈ నేపథ్యంలో తన షుగర్ లెవల్స్ నిరంతరం పర్యవేక్షించాలని, వారానికి మూడు సార్లు తన వైద్యుడితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశమయ్యేలా అనుమతివ్వాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ ఆయనపై పలు విమర్శలు చేశారు.

Also Read: మరో వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. మరీ ఇంత దారుణమా..!

షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గుల షాకుతో కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తన వాదనలు వినిపించారు. దీంతో కేజ్రీవాల్ డైట్ కు సంబంధించి డైలీ మెడికల్ రిపోర్టును అందించాలని కోర్టు.. జైలు అధికారులను కోరింది. ఈడీ ఆరోపణలపై కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాలో ప్రచారం కోసమే ఈడీ ఇటువంటి భూటకపు ప్రచారం చేస్తోందని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News