Big Stories

Pawan Nomination Date Fixed: పవన్ నామినేషన్ కు డేట్ ఫిక్స్.. కుప్పంలో నామినేషన్ వేసిన భువనేశ్వరి

Pawan Kalyan Nomination On April 23 from Pithapuram: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవ్వడంతో.. గురువారం నుంచే నామినేషన్ల పర్వం మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ కు డేట్ ఫిక్సయింది. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. ఏప్రిల్ 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారని చెప్పింది.

- Advertisement -

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 1.45 గంటలకు వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి.. మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. ఈనెల 21న చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ పత్రాలను అందించనున్నారు.

- Advertisement -

Also Read: YS Sharmila nomination: నామినేషన్ దాఖలు, మాటలకు సంకెళ్లా?

ఇక నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రులు నామినేషన్లు వేయనున్నారు. గోపాలపురంలో మంత్రి తానేటి వనిత, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, దెందులూరులో అబ్బయ్య చౌదరి నామినేషన్లు వేయనున్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News