E-Paper
Advertisement

35 Chinna Katha Kaadu: టీచర్ చెప్పారు.. పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి

35 Chinna Katha Kaadu: టీచర్ చెప్పారు.. పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ అవ్వాలి
Advertisement

35 Chinna Katha Kaadu: సాధారణంగా పెద్ద సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి అంటే .. చిన్న సినిమాలు వాటితో పోటీ ఎందుకు అని వెనక్కి తగ్గుతూ ఉంటాయి. తాజాగా తాము కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నట్లు 35 చిన్న కథ కాదు టీమ్ తెలిపింది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 35 చిన్న కథ కాదు. నందకిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విశ్వ, ప్రియదర్శి, గౌతమి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొట్ట మొదటి సారి నివేదా.. ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది. ఇక మొదటినుంచి ఈ సినిమా ఆగస్టు 15 కు రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. కానీ, అదేరోజు పెద్ద హీరోల సినిమాలు అయిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ రిలీజ్ కు రెడీ అయ్యాయి.

Advertisement

ఇక దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మేకర్స్ అధికారికంగా తమ సినిమా వాయిదా పడినట్లు చెప్పుకొచ్చారు. ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ తెలిపారు. ఈ వీడియోలో ప్రియదర్శి.. టీచర్ చెప్తే వినాలి.. రిలీజ్ తేది మారాలి అని చెప్తూ.. ఈ ఆగస్టు 15 కు మాస్ మసాలా సిలబస్ పరీక్షలు ఉన్నాయి. కాబట్టి మా 35 ఫ్యామిలీ డ్రామా సిలబస్ పరీక్షలు మా టీచర్ మరో మంచిరోజుకు మార్చారు. త్వరలో మీ అందరిని కలుసుకుంటాం .. 35 చిన్న కథ కాదు అనిపించుకుంటాం” అంటూ తెలిపారు.

ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను టీచర్స్ డే రోజున అనగా సెప్టెంబర్ 5 న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే.. అప్పటివరకు ఆగాల్సిందే.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×