BigTV English

Double Ismart: పూరీ, మణిశర్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో రామ్

Double Ismart: పూరీ, మణిశర్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో రామ్

Hero Ram Who Made Sensational Comments On Puri, Mani Sharma: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరో రామ్‌ కాంబోలో రాబోతున్న మూవీ డబుల్‌ ఇస్మార్ట్‌. ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉందన్న మ్యాటర్ మనందరికి తెలిసిందేగా. ఈ మూవీ పంద్రాగష్టున వరల్ట్‌ వైడ్‌గా గ్రాండ్‌గా ఈ మూవీని రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మూవీపై ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ కలిగి ఉన్నారు. లైగర్‌ మూవీ భారీ ఫ్లాప్‌ తర్వాత ఎలాగైనా మళ్లీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు పూరి. ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు పూరీ. లైగర్‌తో బాలీవుడ్‌లోనూ పరాజయం మూటగట్టుకున్న పూరి, డబుల్ ఇస్మార్ట్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు.


ఇందులో భాగంగానే ఈ మూవీలో సంజయ్‌ దత్‌ను విలన్‌ రోల్‌ చేయించేందుకు ఈ మూవీలోకి ఆహ్వానించాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ తాజాగా ఆదివారం హన్మకొండలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించింది. ఫుల్‌ జోష్‌లో సాగిన ఈ ఈవెంట్‌లో హీరో రామ్‌ పలు ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. హీరోలనే వారు బుల్లెట్స్‌లాంటి వాళ్లు. పేల్చే గన్‌ సరిగ్గా ఉంటే బుల్లెట్‌ ఎంత వేగంగా బలంగా వెళుతుందో ఈ సినిమాలో చూస్తారంటూ రామ్ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్‌లాంటి గన్‌ ప్రతి హీరోకీ అవసరమని సూచించాడు. నా ఫోన్‌లో ఆయన పేరు గన్‌ అనే ఉంటుందని ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశాడు. ఇక పూరితో పనిచేస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరుగా ఉంటుందని రామ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Also Read: ముఫాసా ట్రైలర్ మామూలుగా లేదుగా, గూస్‌బంప్స్‌ అంతే..!


అంతేకాదు డబుల్ ఇస్మార్ట్‌ విషయంలో ఒత్తిడి సంగీత దర్శకుడు మణిశర్మపై ఎక్కువగా పడిందంటూ రామ్ అన్నాడు.సాధారణంగా సీక్వెల్‌ సినిమా విషయంలో కథపైనే అంచనాలు ఉంటాయని అన్నాడు. కానీ ఈ సినిమాకి సంగీతంపై కూడా అంతే అంచనాలున్నాయని ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారని అన్నాడు.పూరి జగన్నాథ్‌ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన దర్శకుడు అని చెప్పుకొచ్చాడు. దర్శకుడు కావాలని పరిశ్రమకు వచ్చారంటే అందులో ఎక్కువమంది పూరిని చూసి వచ్చుంటారన్నారని రామ్‌ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇదిలా ఉంటే మరో మూడు రోజుల్లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్‌లో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×