E-Paper
Advertisement

Nagma: 49 ఏళ్ల వయసులో ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న స్టార్ హీరోయిన్.. వరుడు అతడేనా..?

Nagma: 49 ఏళ్ల వయసులో ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న స్టార్ హీరోయిన్.. వరుడు అతడేనా..?
Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నగ్మ (Nagma) ఒకానొక సమయంలో తన అందచందాలతో యువతనే కాదు స్టార్ హీరోలను కూడా కట్టిపడేసింది. చాలామంది హీరోలు ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవారంటే ఈమె అందానికి వారు ఎంత మోహితులయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిర్మాతలు, దర్శకులు కూడా ఈమె డేట్స్ కోసం పోటీపడేవారు. చిరంజీవి (Chiranjeevi), నాగార్జున(Nagarjuna ), వెంకటేష్ (Venkatesh), బాలకృష్ణ(Balakrishna )వంటి సీనియర్ స్టార్ హీరోలు అందరితో కూడా నటించిన ఈమె.. రీల్ లైఫ్ లో సక్సెస్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.

49 ఏళ్లయినా ఒంటరి జీవితం..

Advertisement

అయితే వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తన జీవితంలో ఎంతో మందిని ప్రేమించింది. కానీ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈమె వయసు 49 ఏళ్ళు. ఐదు పదుల వయసుకు చేరువలో ఉన్నా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో పలు రకాల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) తో ప్రేమాయణం కొనసాగించింది. ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. తిరుపతి లో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అప్పటికే గంగూలీ కి పెళ్లి అయింది. ఈ విషయం గంగూలీ భార్యకు తెలియడంతో.. గంగూలీ పెళ్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

నలుగురితో ప్రేమాయణం..

Advertisement

ఇక సౌరవ్ గంగూలీ నుంచి దూరమైన నగ్మా.. శరత్ కుమార్ (Sarath Kumar) తో ప్రేమలో పడింది. దీనికి తోడు శరత్ కుమార్ నగ్మా కోసం సినిమాలు కూడా నిర్మించారు. ఇక నగ్మా తో తిరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న శరత్ భార్య ఆయనతో గొడవలు పెట్టుకుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన శరత్ కుమార్ ఏకంగా తన భార్యకే విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత శరత్ కుమార్ కి, నగ్మా కి గ్యాప్ రావడంతో ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత నగ్మా రవికిషన్ (Ravi Kishan) tho పరిచయం పెంచుకొని, అతనితో లివింగ్ రిలేషన్ లో కూడా వుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరమయ్యారు. ఆ తర్వాత భోజ్ పురి స్టార్ మనోజ్ తివారీ (Manoj Tiwari ) కి కూడా దగ్గరై ,అతడితో కూడా బ్రేకప్ చెప్పుకుంది. ఇలా ఎంతోమందితో ప్రేమాయణం నడిపి, చివరికి ఒంటరి అయిన నగ్మా మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ నటుడితో ఏడడుగులు వేయనున్న నగ్మా..

అక్కడ ఒక వెలుగు వెలుగిన ఈమె..ఇప్పుడు మళ్లీ ఒక బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 49 ఏళ్ల వయసులో ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నగ్మా కు సంబంధించిన ఈ ప్రేమ, పెళ్లి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసి ఈమె అభిమానులు ఇప్పటికైనా తమ అభిమాన హీరోయిన్ ఒక నిర్ణయానికి వచ్చింది అని, అయితే అతడిని పెళ్లి చేసుకోవాలని, మునుపటిలాగ ప్రేమతోనే బ్రేకప్ చెప్పుకోవద్దని కోరుకుంటున్నారు. మరి నగ్మా ప్రేమ, పెళ్లి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×