BigTV English

Kajal Agarwal Oops Movement: కాజల్‌ అగర్వాల్ నడుముని టచ్‌ చేయబోయిన అభిమాని.. తరువాత ఏం జరిగిందంటే..?

Kajal Agarwal Oops Movement: కాజల్‌ అగర్వాల్ నడుముని టచ్‌ చేయబోయిన అభిమాని.. తరువాత ఏం జరిగిందంటే..?

A fan who gave an unexpected shock to Kajal, touching her waist


A Fan Who Gave Unexpected Shock to Kajal, Touching Her Waist: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్ దాకా.. హీరోయిన్స్ షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్స్‌, ప్రైవేట్ ఈవెంట్స్‌కు వెళ్లి అక్కడ సందడి చేయడం శరామామూలు అయిపోయింది. అలాంటి ఈవెంట్స్‌కు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ దగ్గర నుంచి కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవడం సర్వ సాధారణం. ఇక స్టార్ హీరోయిన్స్ అయితే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వారు పడే బాధలు వర్ణణాతీతం. దాదాపుగా ఇలాంటి ఇబ్బందులను చాలామంది హీరోయిన్లు ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి జనం గుంపుగా ఉండే చోట హీరోయిన్స్ న‌డ‌వ‌టానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తాజాగా ఇలాంటి ఇబ్బందిక‌రమైన సంఘటననే ఎదుర్కొంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ టాలీవుడ్ ఆడియెన్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన అందం, అభినయంతో కోట్లాది మంది ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. తన నటన, అభినయంతో ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. 2020లో బిజినెస్ మ్యాన్‌ గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని నటనకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చి యాక్టింగ్‌లో దూసుకుపోతుంది. గ‌తేడాది భగవంత్‌ కేసరి మూవీతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి మెప్పించింది ఈ భామ..ఈ బ్యూటీ ఇప్పటికీ అదే ఫిట్‌నెస్‌తో ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.


Read More: షారుఖ్‌కి ఇడ్లీ, వడ తెచ్చిన తంటా.. ఫ్యాన్స్ ఫైర్

ఇక తాజాగా కాజల్‌.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.10 లో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్ళి సందడి చేసింది. ఫ్యాన్స్ చాలామంది అక్కడ హడావిడి చేయడంతో వాళ్ళ సెల్ఫీలకు స్టిల్స్ ఇచ్చింది ఈ భామ. అయితే అందరూ బాగానే సెల్ఫీలు దిగి వెళ్లిపోయారు. కానీ ఓ అభిమాని మాత్రం కాజల్‌తో ఫోటో దిగుతూ పబ్లిక్‌గా ఆమె నడుముపై చేయి వేశాడు. దీంతో ఆమె ఒక‌్కసారిగా ఖంగు తిన్నది. వెంటనే కాజల్‌కి సంబంధించిన బౌన్సర్లు అతని పక్కకు లాగి పడేశారు.

గతంలో కూడా కాజల్ ఇలాంటి ఓ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొంది. మళ్లీ అలాంటి సీనే రిపీట్ అవడంతో కాజల్ ఒకింత షాక్, ఖంగారుకి గురయ్యిందనే చెప్పాలి. ఏదేమైనా ఇలాంటి ఘటనలు గతంలోనూ సూర్య భార్య జ్యోతికకు కూడా జరిగింది. అప్పుడు ఆమె చాలా అసహనంగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయింది. ఇక ఇలాంటి ఘటనలు చూసిన నెటిజన్లు అలాంటి వారిపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×