BigTV English

Shahrukh khan: షారుఖ్‌కి ఇడ్లీ, వడ తెచ్చిన తంటా.. ఫ్యాన్స్ ఫైర్

Shahrukh khan: షారుఖ్‌కి ఇడ్లీ, వడ తెచ్చిన తంటా.. ఫ్యాన్స్ ఫైర్
Shahrukh called ramcharan idli vada fans fire
 

Shahrukh Called Ramcharan Idli Vada Fans Fire: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో మనందరికి తెలిసిన విషయమే. కానీ అంబానీ వేడుకల్లో జరిగిన ఓ సీన్‌ ఇప్పుడు తనని చిక్కుల్లో నెట్టేసింది. అంతేకాదు ఇటు రామ్‌చరణ్‌ అభిమానులు, అటు షారుఖ్‌ అభిమానులు సైతం షారుక్‌పై మండిపడుతున్నారు. ఈ వేడుకల్లో హీరో రామ్‌చరణ్‌ని ఇడ్లీ వడ కమ్‌ టూ డయాస్‌ అని పిలవడం మనం చూశాం. ఇందుకు గానూ.. అలా రామ్‌చరణ్‌ని ఎందుకు ఎగతాళిగా పిలిచాడంటూ ఫ్యాన్స్ బాధపడ్డారు. ఒక సూపర్‌ స్టార్‌తో మరో అగ్రహీరో ఇలాంటి మాటలు ఎలా అనగలడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్‌లను పంచుకుంటున్నారు. నెటిజన్లు చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ అంటే ఒక సూపర్ స్టార్, కింగ్ ఖాన్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా.. బాద్‌షా, పఠాన్, జవాన్ అని కూడా పిలుస్తుంటారు. అభిమానులు ఎంతగానో గౌరవిస్తారు. 3 దశాబ్దాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను చాలా ప్రేమిస్తారు. షారుక్‌ ఖాన్‌ను చూసి గర్వపడుతారు కూడా. ఇటువంటి పరిస్థితిలో..అతని నోటి నుండి వచ్చే ప్రతి పదం లోతైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే వారు కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. కానీ..ఆయన చేసిన ఒక్క తప్పు మూలంగా ఆడియెన్స్ హృదయాలు ఒక్కసారిగా బద్దలయ్యి షారుక్‌ని చీదరించుకునేలా చేశాయి.

అంబానీ పార్టీ తర్వాత, షారుక్ ఖాన్ రామ్‌చరణ్‌ని ఇడ్లీ వడ కమ్‌ టూ డయాస్‌ అని పిలవడంపై అభిమానులు షారుఖ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీ, వడా అంటూ రామ్‌చరణ్‌ని ఎగతాళి చేసిన తీరు..అది నిజంగా హృదయ విదారకమైనది అంటూ తీవ్రంగా పరిగణిస్తున్నారు. మీ కామెడీ అద్భుతంగా ఉందని మేము అంగీకరిస్తున్నాము. కానీ.. ఈసారి ఆ జోకే మిమ్మల్ని చాలా జోకర్‌ని చేసిందంటూ నెటిజన్లు కామెంట్లతో పైర్ అవుతున్నారు. సౌత్ స్టార్‌పై మీరు చేసిన ఈ రకమైన వ్యాఖ్యలు అటు ఫ్యాన్స్‌కి, హీరో రామ్‌చరణ్‌కు సైతం నచ్చలేదని పలువురు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే విషయంపై రామ్‌చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ సోషల్ మీడియాలో తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసింది. కోట్లాదిమంది ప్రజల్లాగే ఆమె కూడా షారుఖ్ ఖాన్ అభిమాని. అతను ఒక కామెంట్‌లో, ‘నేను షారుక్ ఖాన్‌కి పెద్ద అభిమానిని. అయితే స్టేజ్‌పై రామ్‌చరణ్‌ని పిలిచిన తీరు నాకు అస్సలు నచ్చలేదంటూ డైరెక్ట్‌గా చెప్పేసింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై కూడా స్పందించారు. ఆమె రాసింది, ‘ఇడ్లీ వడ సంభార్ రామ్‌చరణ్, మీరు ఎక్కడ ఉన్నారు? అది విని పార్టీ హాలు నుండి బయటకు వచ్చాను. ఇది రామ్ చరణ్‌కి చాలా అవమానకరం.

Read More: ఖడ్గం మూవీలో కీ రోల్‌ని మిస్సయిన స్టార్ హీరోయిన్

రామ్‌చరణ్ దక్షిణాదిలో పెద్ద పేరు పలుకుబడి ఉంది. గత సంవత్సరం అతను, అతని బృందం కారణంగా, ప్రతి భారతీయుడు ‘నాటు నాటు’ పాడుతున్నాడు. ఇది ఆస్కార్ గోల్డెన్ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు ఓ పార్టీలో రామ్‌చరణ్ కోసం ఇలాంటి పదజాలంతో పిలవడం నిజంగా తప్పని భావిస్తున్నారు. ఇక మరోపక్క.. ఫ్యాన్స్‌ సైతం ఒక సూపర్‌స్టార్‌ మరో సూపర్‌స్టార్‌కి ఇలాంటి జోక్‌ వేస్తే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కామెంట్లు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×