BigTV English

Income Tax : ఇంట్లో ఎంత వరకు డబ్బు ఉంచుకోవచ్చో తెలుసా..?

Income Tax : ఇంట్లో ఎంత వరకు డబ్బు ఉంచుకోవచ్చో తెలుసా..?

Income Tax


 

Income Tax : మనకు డబ్బులు దాచేందుకు బ్యాంకులు, ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంటిలో కొంత నగదు ఉవచడం సహజమే. అయితే.. దానికో లిమిట్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. మరి చట్టబద్ధంగా ఇంట్లో నగదు ఎంత దాచుకోవచ్చు? అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పరిమితికి మించి ఇంట్లో నగదు ఉంచితే ఏరికోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది.


నిజానికి ఇంట్లో నగదును ఉంచుకోవడం అక్రమమేమీ కాదు. ఇంట్లో ఎంత మొత్తమైన నగదు నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లో ఇంతే నగదు ఉండాలిని ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి పరిమితులు ఏమి విధించలేదు. కానీ మీ దగ్గర ఉన్న నగదు మొత్తం సక్రమమైన మార్గాల్లోనే ఆర్జించినదై ఉండాలి. దాచుకున్న డబ్బులకు సరైన లెక్కలు ఉండాలి.

READ MORE : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్

మీ ఇంట్లో ఎంత డబ్బు ఉంది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు ఆధారాలతో సహా మీరు ఐటీ శాఖకు చెప్పగలిగేలా ఉండాలి. వాటికి సంబంధించిన పత్రాలు సైతం ఉంటే ఇంకా మంచిది. అప్పుడు ఎలాంటి చిక్కులు ఎదురుకావు. వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల ఆధారాలు మీ వద్ద ఉండాలి.

ప్రతి పైసాకు లెక్కలు చూపించాల్సి వస్తుంది. ఇదే సమయంలో మీరు ట్యాక్స్ కడుతున్నారా? లేదా అనేది ఐటీ శాఖ పరిశీలిస్తుంది. మీరు పన్ను చెల్లించని పక్షంలో పన్ను ఎగవేత కింద చట్ట పరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ డబ్బులకు సరైన లెక్క చూపించకపోతే ఆ సొమ్మును మొత్తాన్ని సీజ్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది.

మీరు సొమ్మును వ్యవసాయం నుంచి సంపాదించినప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు, ఇతర ఆధారాలు ఆ సమయంలో చూపించాలి. అన్ని విధాల జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇంట్లో దాచిన డబ్బును కోల్పోకుండా ఉంటాం. లేదంటే ఐటీ శాఖకు మీ డబ్బు మొత్తం తీసుకెళ్లే అధికారం ఉంటుంది.

మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? మీకు వచ్చే ఆదాయం ఎంత? ఆ ఆదాయానికి మంచిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్నలు సందిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. వీటికి మీరు సరైన సమధానం చెప్పాలి. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలి. అలాగే ఇంట్లో ఉన్న నగదు ట్యాక్స్ పరిధిలోకి వస్తే దానికి కూడా మీరు పన్ను చెల్లించాల్సి వస్తుంది.

READ MORE : మీ పీఎఫ్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉన్నాయా?.. ప్రాసెస్ ఇదే!

మీ దగ్గర లెక్కకు మించిన నగదు ఉంటే ఐటీ శాఖవాటిని సీజ్ చేస్తుంది. అలానే దానిపై అదనంగా 37 శాతం మేర పెనాల్టీలు విధించే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత తక్కువ మొత్తంలో నగదును ఇంట్లో ఉంచుకోండి.

ఒక వేళ పెద్ద మొత్తంలో ఇంట్లో నగదు ఉంచుకోవాల్సిన పరిస్థితులు వస్తే.. ఆ డబ్బుకు సంబంధించిన అన్ని బిల్లులు, పత్రాలు సిద్ధంగా ఉంచాలి. ఐటీ శాఖ రైడ్ చేసి డబ్బును పట్టుకుంటే వాటిని చూపించి రక్షించుకోవచ్చు.

Tags

Related News

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

Big Stories

×